రామ్ చరణ్ “పెద్ది నుంచి” చికిరి సాంగ్ ప్రోమో విడుదలైంది. ఇందులో చరణ్ వేసిన స్టెప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతకుముందు బుచ్చిబాబు, ఏ.ఆర్. రెహమాన్ స్టూడియోలో చేసిన సందడి కూడా అభిమానులను అలరించింది.
అయితే ఈ సాంగ్ ప్రోమోకి సోషల్ మీడియాలో కాపీ ట్రోలింగ్ కూడా మొదలైంది. ప్రోమోలో వచ్చిన బీట్ వాన వాన వెల్లువాయే పాటకు దగ్గరగా ఉందని ట్రోల్ మొదలుపెట్టారు. “దీని ఒరిజినల్ ప్లే చేయండిరా” అనే మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
నిజానికి ఆ ఒక్క చిన్న బీట్ ఆధారంగా కాపీ ముద్ర వేయడం సరైంది కాదు. ఆ పాటలోని ఎత్తుగడ, ఆర్కెస్ట్రేషన్ చాలా కొత్తగా ఉన్నాయి. వెస్ట్రన్ మ్యూజిక్‌లో ఇలాంటి బీట్స్ రెగ్యులర్. మ్యూజిక్‌పై అవగాహన ఉన్నవాళ్లకు ఆ తేడా సులభంగా అర్థమవుతుంది.
అయితే ఇక్కడ సంగీతం కాదు.. ఏదో సంక్షోభం సృష్టించాలనే ఉద్దేశమే దీనికి అసలు కారణం. నేటి కాలంలో పెద్ద హీరో సినిమా నుంచి ఏదైనా కొత్త కంటెంట్ వస్తే దానికి యాంటి ఫ్యాన్స్ నుంచి ట్రోల్ కంటెంట్ కూడా సహజంగానే వస్తుంది.
అయితే పూర్తి పాట వినకుండా ప్రోమో లో వినిపించిన చిన్న బీట్ ని కూడా ట్రోల్ చేసి కాపీ మరక వేస్తారా? అన్నది రెహమాన్ టీమ్ కు షాక్. రెహ్మాన్ పై“కాపీ” మరకలు చాలా అరుదు. కానీ సోషల్ మీడియా యుగంలో ఈ ట్రోల్ తప్పదు. మరి నిజంగా చిరికిలో కాపీ ఉందా అనేది పూర్తి పాట వస్తే తేలిపోతుంది.
