ద‌ర్శ‌కుడిగా అర‌వింద్ స్వామి

అర‌వింద్ స్వామి.. 90వ ద‌శ‌కంలో మార్మోగిన పేరు. రోజా, ముంబ‌యి సినిమాలు చూశాక‌.. దేశంలోని అమ్మాయిలంతా అర‌వింద్ స్వామి ఫ్యాన్స్ అయిపోయారు. క‌థానాయ‌కుడిగా కొంత బ్రేక్ తీసుకుని `క‌డ‌లి`తో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన అర‌వింద్ స్వామికి `త‌ని ఒరువ‌న్‌` గొప్ప విజ‌యాన్ని అందించింది. దాన్ని `ధృవ‌`గా రీమేక్ చేసిన‌ప్పుడూ అర‌వింద్ స్వామినే ఎంచుకున్నారు. తెలుగులోనూ ఆ పాత్ర‌కు మంచి పేరొచ్చింది. ఇప్పుడు `న‌వాబ్`లోనూ అర‌వింద్ స్వామి త‌న విశ్వ‌రూపం చూపిస్తున్నాడు. త్వ‌ర‌లోనే మెగాఫోన్ ప‌ట్టుకోబోతున్న‌ట్టు సంకేతాలిచ్చాడు అర‌వింద్ స్వామి. మూడు క‌థ‌లు త‌న ద‌గ్గ‌ర సిద్దంగా ఉన్నాయ‌ని అందులో ఓ సినిమాని అతి త్వ‌ర‌లో మొద‌లెడ‌తాన‌ని చెప్పుకొచ్చాడు. “నా పాత్ర గురించీ, క‌థ గురించీ క్షుణ్ణంగా చ‌ర్చించాకే ఓ సినిమా ఒప్పుకుంటా. సృజ‌న‌కు సంబంధించిన స‌ల‌హాలూ ఇస్తుంటా. అందుకే క‌థ గురించీ ద‌ర్శ‌క‌త్వం గురించీ ఓ అవ‌గాహ‌న ఏర్ప‌డింది. ఎప్ప‌టి నుంచో ద‌ర్శ‌క‌త్వంపై గురి ఉంది. కానీ కుద‌ర‌డం లేదు. అతి త్వ‌ర‌లోనే నా క‌ల నెర‌వేర్చుకుంటా“ అంటున్నాడు అర‌వింద్ స్వామి. తెలుగులో ధృవ త‌ర‌వాత త‌న‌కు మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ని, అయితే ఏదీ ఒప్పుకోలేద‌ని, త్వ‌ర‌లో ఓ తెలుగు చిత్రానికి సంత‌కం చేయ‌బోతున్నానని చెప్పుకొచ్చాడు. మ‌రి ఆ సినిమా ఏమిటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

వినటానికి బహు సక్కగున్నాడు సామీ!!

https://www.youtube.com/watch?v=qxbHtcfHq2s&list=PLTtJUIuknk93P010cakd2jZANGFP70tj9&index=1 అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప 2: ది రూల్’ పై మంచి అంచనాలు వున్నాయి. ప్రమోషనల్ కంటెంట్ ఆ అంచనాలని ఇంకా పెంచుతోంది. ఇప్పటికే విడుదలైన ‘గ్లింప్స్, టీజర్, పుష్ప...

పవన్ అను నేను… ఫ్యాన్స్ వెయిటింగ్..!!

ఏపీలో ఏ నోట విన్నా పిఠాపురంలో వార్ వన్ సైడ్... పవన్ విక్టరీ పక్కా అని తేల్చేస్తున్నారు. మెజార్టీ లెక్కేంత అనేది మాత్రమే క్లారిటీ రావాల్సి ఉందంటున్నారు. ఎట్టకేలకు తమ అభిమాన...

రేవంత్ రిస్క్ చేస్తున్నారా…?

సీఎం రేవంత్ రెడ్డి రిస్క్ చేస్తున్నారా...? తెలంగాణ సెంటిమెంట్ ను ప‌ర్ఫెక్ట్ గా వాడుకునే బీఆర్ఎస్ కు స్వ‌యంగా అస్త్రం ఇస్తున్నారా...? రేవంత్ స‌క్సెస్ అయితే కేసీఆర్ కు మ‌రింత...

మీడియా వాచ్ : మోదీ ఇంటర్యూలే – ప్రతిపక్షానికి కనీస స్పేస్ ఏది ?

టీవీ చానలా.. న్యూస్ పేపరా.. వెబ్ సైటా... యూట్యూబ్ చానలా.. చివరికి న్యూస్ ఏజెన్సీనా అన్నది పాయింట్ కాదు .. ప్రధాని మోదీ ఇంటర్యూ ఏదో ఓ మాధ్యమంలో రోజూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close