జగన్ రెడ్డి నిర్వాకానికి ఇప్పుడు వేల మంది విద్యార్థులు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాను అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ వర్శిటీని కడపలో ప్రారంభించారు. కానీ అదేదో సొంత వ్యవహారం అయినట్లుగా ప్రారంభించేశారు.ఎవరి అనుమతి తీసుకోలేదు. సర్టిఫికెట్లు ఎవరు ఇస్తారో స్పష్టత లేదు. ఆర్కిటెక్చర్ వర్శిటీ పెట్టాలంటే ఖచ్చితంగా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA) అనుమతి ఉండాలి. తన పాలనా కాలంలో అనుమతులు తీసుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు అందులో చదువుకున్న వారు తమకు పనికి వచ్చే సర్టిఫికెట్లు ఎవరిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆ విద్యార్థులను షర్మిల పరామర్శించారు.
డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం 2020, 2021, 2022 సంవత్సరాలలో బి.ఆర్క్ కోర్సులో విద్యార్థులను చేర్చుకుంది, కానీ ఈ కోర్సుకు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA) నుండి అవసరమైన అనుమతులు పొందలేదు. ఈ అనుమతులు లేకపోవడం వల్ల విద్యార్థుల డిగ్రీలు చెల్లుబాటు కావు. విద్యార్థులు తమ డిగ్రీల చెల్లుబాటు కోసం COA అనుమతులు పొందాలని డిమాండ్ చేస్తూ నిరసనలు మరియు నిరాహార దీక్షలు చేపట్టారు.
ఈ విశ్వవిద్యాలయం 2020లో గత వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి అనుబంధం అని చెబుతూ స్థాపించారు. విశ్వవిద్యాలయం ప్రస్తుతం కడపలోని గ్లోబల్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన అద్దె భవనాల్లో నడుస్తోంది. యోగి వేమన విశ్వవిద్యాలయం సమీపంలో 110 ఎకరాల స్థలం కేటాయించారు. రూ. 350 కోట్ల విలువైన నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేశారు కానీ రూపాయి కూడా జగన్ కేటాయించలేదు. COA అనుమతులు లేకుండా విద్యార్థులను చేర్చుకోవడం ద్వారా వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేశారని జగన్ , ఎంపీ అవినాష్ ష్రమిల ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్ పేరుతో ఉందని టార్గెట్ చేసుకోకుండా ప్రస్తుత ప్రభుత్వమైన అనుమతులు తెచ్చి.. ప్రస్తుత విద్యార్థలకు పనికి వచ్చే సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. జగన్ చేసిన తప్పు దిద్దాలని షర్మిల విజ్ఞప్తి చేస్తున్నారు.