ఇండిగో సంక్షోభం విషయంలో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారింది రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్ గోస్వామి వ్యవహారం. ఆయన బీజేపీని కాపాడటానికి, మోదీ ప్రభుత్వంపై నిందలు రాకుండా ఉండటానికి ఎవరో ఒకర్ని బలి చేయాలని ముందుగానే ప్లాన్ చేసుకుని.. రామ్మోహన్ నాయుడ్ని టార్గెట్ చేసుకున్నారు. డిబేట్లకు టీడీపీ నేతల్ని పిలిచారు.కానీ ఆయన వ్యూహన్ని టీడీపీ నేతలు ఊహించలేకపోయారు. పైగా ఆయనతో వాదించేంత వాదనా పటిమ.. రాజకీయ నేతలకు ఉండదు. ముందుగా ఆయన కేకలు పెట్టి అందరికీ దడ పుట్టిస్తారు. అప్పటికే మాట్లాడాలనుకున్నవాళ్లు చాలా వరకూ మర్చిపోతారు. ఆయన ఓ టార్గెట్ పెట్టుకుని డిబేట్లు ప్రారంభించారు కాబట్టి ఆయన ట్రాప్ లో టీడీపీ సులువుగా పడిపోయింది.
లోకేష్ మానిటర్ చేస్తున్నారని చెప్పిన ఒక్క మాటతో అడ్వాంటేజ్ తీుకున్న ఆర్నాబ్
ఇంగ్లిష్ మీడియాలో డిబేట్లకు హాజర్యయే టీడీపీ నేతల్లో దీపక్ రెడ్డి ఒకరు. విద్యావంతుడు అయిన ఆయన గతంలో కూడా ఇలా డిబేట్లకు వెళ్లి సమర్థంగా వాదన వినిపించారు. ఇండిగో ఇష్యూలో ఆయన గందరగోళానికి గురయ్యారు. లోకేష్ మానిటర్ చేస్తున్నారని చెప్పారు. అసలు నారా లోకేష్ కు ఏం సంబంధం అని ఆయన ఆలోచించలేకపోయారు. అప్పటికి లోకేష్ విదేశీ పర్యటనకు వెళ్లారు. అయినా ఎవరి పనులు వారికి ఉంటాయి. రామ్మోహన్ నాయుడు తన శాఖను తాను నిర్వహించగల సమర్థుడు. ఎవరూ వేలు పెట్టాల్సిన అవసరం లేదు. అది కన్వే చేయాల్సిన దీపక్ రెడ్డి తడబడ్డారు. ఫలితంగా మొత్తం అదొక్కటే అందరికీ పెద్ద ఆయుధం అయింది.
ఆర్నాబ్ పై దాడి చేస్తున్న టీడీపీ సోషల్ మీడియా
ఆర్నాబ్ షోలో ఆయనకు చిక్కడం ద్వారా ..టీడీపీ ఇబ్బంది పడింది. నిజానికి ఆయన ఇలా ఆడుకోవడానికి ప్రిపేర్ అయి ఉంటారు. ఒక్క బీజేపీకి మాత్రమే ఆయన మినహాయింపు ఇస్తారు. అది కూడా మోదీ, షాలకు మాత్రమే. వారిద్దరికీ సమస్యలు వస్తాయనుకుంటే..బీజేపీ నేతల్ని కూటమి నేతల్ని బలి చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తారు. ఇండిగో విషయంలో కేంద్రంపై ప్రయాణికుల్లో వ్యతిరేకత వస్తుంది. సాల్వ్ చేయలేకపోయారని అనుకుంటారు. అందుకే ఈ అంశంలో రామ్మోహన్ నాయుడుని నిందించడానికి పక్కా ప్రణాళికతో వచ్చారు.ఆ ట్రాప్ లో సక్సెస్ అయ్యారు. ఇది గుర్తించలేక టీడీపీ నేతలు .. ఆర్నాబ్ మీద పడిపోతున్నారు. ఆయనను టార్గెట్ చేయడం వల్ల పైసా ప్రయోజనం ఉండదు.గతంలో రైలు ప్రమాదాలు జరిగినప్పుడు ఆయన రాజకీయం చేయడం ఎందుకని రివర్స్ లో డిబేట్లు నిర్వహించారు. ఆయన పాలసీల గురించి తెలిసి..దానికి తగ్గట్లుగా వ్యవహరించకపోవడం టీడీపీ తప్పిదమే.
ఇంతటితో ఆపేస్తే బెటర్
జాతీయ మీడియా లేదా లోకల్ మీడియాపై ఆరోపణలు చేయడం.. లేదా విమర్శలు చేయడం ఎప్పటికైనా మిస్ ఫైర్ అవుతుంది. తప్పు టీడీపీ వైపు జరిగింది. దాన్ని పెంచి పెద్దది చేసుకుంటోంది కూడా టీడీపీనే. రామ్మోహన్ నాయుడు ఈ సంక్షోభంలో మంచి పనితీరు కనబరిచారు. కానీ టీడీపీ నేతలు చేసిన పని వల్ల ఆయన పనితీరు బాగో లేదన్న భావనను ఆర్నాబ్ ద్వారా పంపే ప్రయత్నం లో భాగమయ్యారు. ఇప్పుడు ఇండిగో సమస్య సద్దుమణిగింది. ఇక నుంచి ఈ టాపిక్ ను టీడీపీ క్యాడర్, సోషల్ మీడియా వదిలేసి.. ఇతర అంశాలపై దృష్టి పెడితే మంచిదేమో
