టీఆర్‌పీ స్కాంలో పీఎంవోనీ తెచ్చిన ఆర్నాబ్..!

రిపబ్లిక్ టీవీ ఓనర్ కం జర్నలిస్ట్ ఆర్నాబ్ గోస్వామి వ్యవహారం ఇప్పుడు.. మీడియా వర్గాల్లో పెను సంచలనంగా మారుతోంది. టీఆర్‌పీలను మార్ఫింగ్ చేసిన స్కాంపై జరుగుతున్న విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో కొన్ని పత్రాలు.. వాట్సాప్ చాట్‌లు బయటకు వచ్చాయి. బార్క్ రేటింగ్ అధికారులను ఆర్నాబ్ గోస్వామి ఎలా మభ్య పుచ్చారో తెలిపే ఆ చాట్స్ పత్రాలు ఉన్నాయి. అవసరం అయితే.. పీఎంవోతో చెప్పి సాయం చేస్తానని కూడా వాటిలో బార్క్ అధికారులకు ఆర్నాబ్ హామీ ఇచ్చినట్లుగా ఉంది. మంత్రులంతా మనవైపే ఉన్నారని భయపడాల్సిన పని లేదని  కూడా ఆయన భరోసా ఇచ్చారు.

టీవీ చానళ్ల రేటింగ్స్ విషయంలో రిపబ్లిక్ టీవీకి అనూహ్యమైన ఎదుగుదల కనిపించేది. ఇతర అగ్ర చానళ్లకు…  రేటింగ్ తక్కువగా వచ్చేది. అలాగే… బార్క్ లోని రేటింగ్ నిర్ణయించే అధికారులు.. ఒక్క రిపబ్లిక్ టీవీ విషయంలోనే కాదు.. రీజినల్ చానళ్ల విషయంలోనూ… కొన్నిఇతర చానళ్ల యాజమాన్యాలతో కలిసి కుట్ర పూరితంగా రేటింగ్స్ తగ్గించడం లేదా.. పోటీ చానళ్లకు పెంచడం లాంటి అక్రమాలకు పాల్పడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం టీఆర్పీ స్కామ్‌ను సీరియస్‌గా తీసుకోవడంతో ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తోంది. దీంతో… మీడియా వర్గాల్లో పెను సంచలనంగా నమోదవుతోంది.

తెలుగులోనూ టీఆర్పీ స్కాం జాడలు కనిపిస్తున్నాయి. ఐ న్యూస్ టీవీ రేటింగ్స్ పెరుగుతున్నాయని వాటిని వీలైనంతగా తగ్గించాలని … ఓ తెలుగు టీవీ యాజమాన్యం ..బార్క్ రేటింగ్ అధికారులతో జరిపిన రికార్డులు వెలుగులోకి వచ్చాయి. అలాగే.. ఇతర రాష్ట్రాల్లోని చానల్స్ విషయంలోనూ బయటపడ్డాయి. ఇదిచిన్న స్కాం కాదని… ఇందులో ఆర్నాబ్ ప్రమేయం మాత్రమే కాదని.. చాలా మీడియా ప్రముఖులు ఉన్నారని అనుమానిస్తున్నారు. బార్క్అనేది.. అన్ని మీడియా చానళ్ల దగ్గర చందాలు కట్టించుకుని… పని చేస్తుంది. నిజాయితీగా రేటింగులు ఇవ్వాల్సిన సంస్థ… అక్రమాలకు నిలయంగా మారింది. మహారాష్ట్ర సర్కార్ టీఆర్పీ స్కాంను వెలుగులోకి తెచ్చిన తర్వాత బార్క్ రేటింగులు ఇవ్వడాన్ని నిలిపివేసింది.

ఆర్నాబ్ గోస్వామి విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. టీఆర్పీ స్కాంలో ఆయన పాత్రపై స్పష్టమైన ఆధారాలుండటంతో ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన మళ్లీ కోర్టును ఆశ్రయించారు. నెలాఖరు వరకూ అరెస్ట్ లాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు పోలీసులకు సూచించింది. ముందు ముందు ఈ టీఆర్పీ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీడియా రంగంలో ప్రముఖు ఇతర చానళ్లను ఎలా తొక్కేశారో వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close