డీజీపీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జస్ట్ మిస్..!

ఆంధ్రప్రదేశ్ డీజీపీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినంత పనయింది. చివరికి ప్రభుత్వ న్యాయవాది న్యాయమూర్తి బతిమలాడి..ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తామని హామీ ఇచ్చి..ఆ వారెంట్ జారీ కాకుండా నిలుపగలిగారు. కోర్టుల్ని.. చట్టాల్ని ఉల్లంఘించే వారికి జారీ అయ్యే నాన్ బెయిలబుల్ వారెంట్‌ను హైకోర్టు ఏకంగా డీజీపీకే జారీ చేయాలనుకుందంటే.. ఆయన ఎంత తప్పిదానికి పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చు. ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ను గతంలో హైకోర్టు తమ ఎదుట కావాలని ఆదేశించింది. ఓ ఎస్‌ఐకి సీఐగా ప్రమోషన్ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదు. హైకోర్టు ఆదేశించినా ఇవ్వలేదు. దీంతో కోర్టు ధిక్కరణ కింద పిటిషన్‌పై విచారణలో ఆయన హైకోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.

ఇరవై ఐదో తేదీన ఆయన హైకోర్టుకు హాజరు కావాల్సి ఉంది. కానీ రాలేకపోతున్నానని ఓ లీవ్ లెటర్ లాంటిది పంపించారు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. ఆ లీవ్ లెటర్‌లో చెప్పిన కారణమే… హైకోర్టు న్యాయమూర్తులకు కోపం తెప్పించింది. అదేమింటటే… తాను ఎన్నికల విధుల్లో బీజీగా ఉన్నానని అందుకే… విచారణకు రాలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. గౌతం సవాంగ్ లేఖ చూసి జడ్జిజలకు చిర్రెత్తుకొచ్చింది. ఓ వైపు… ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా.. ఎస్‌ఈసీకి సహకరించకుండా.. ఆయనతో సమావేశాలకు కూడా హాజరు కాకుండా… ఉండటం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అదే విషయాన్ని హైకోర్టు గుర్తు చేసి మండి పడింది.ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా.. కోర్టుకు డుమ్మా కొట్టడానికి ఆ కారణం చెప్పడమేమిటని ప్రశ్నించింది.

డీజీపీ తీరుపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడానికి సిద్ధమయింది. అయితే ఇరవై ఏడో తేదీ ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరవుతారని.. వారెంట్ జారీ చేయవద్దని ప్రభుత్వ లాయర్ కోరడంతో.. చివరికి అంగీకరించింది. ఇరవై ఏడో తేదీన హైకోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రకారం… ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత డీజీపీ.. ఎస్‌ఈసీ పరిధిలో ఉంటారు. అందుకే.. తాను నిబంధనలకు విరుద్దంగా ఎన్నికల నిర్వహణకు సహకరించకపోయినా.. . ఆ అడ్వాంటేజ్ వాడుకోవాలనుకున్నారు. కానీ కోర్టు కనిపెట్టేసింది.

గౌతంసవాంగ్‌కు హైకోర్టు చీవాట్లు పెట్టడం ఇదే మొదటి సారి. కాదు ఆయన డీజీపీ పదవి చేపట్టిన తర్వాత ఏపీలో రూల్ ఆఫ్ లా అమలు చేయలేకపోతున్నారని ఎన్నో సార్లు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చేతకాకపోతే రాజీనామా చేయాలని కూడా సలహా ఇచ్చింది. కానీ సవాంగ్ అన్నీతుడిపేసుకున్నారు. యథావిధిగా పని చేస్తున్నారని తాజా పరిణామాలతోనే తేలిపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

నిస్సహాయుడిగా కేసీఆర్..!?

బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ పట్టు కోల్పోతున్నారా..? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఆ పార్టీలో క్రమశిక్షణ లోపిస్తుందా..? నేతలు హద్దులు దాటుతున్న చర్యలు తీసుకోని నిస్సహాయ స్థితికి కేసీఆర్ చేరుకున్నారా..? అంటే అవుననే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close