జైట్లీ ఇక లేరు..! లా ఎక్స్‌పర్ట్… లెక్కల్లో ఘనాపాటి..!

బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన అంతుచిక్కని క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. పలుమార్లు చికిత్సకు విదేశాలకు వెళ్లి వచ్చారు. కొద్దిరోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఆరోగ్యం క్షిణిస్తూ వచ్చింది. చివరికి కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.ఎన్డీఏ -2 కేబినెట్‌లో కూడా ఆయన అనారోగ్యం కారణంగానే చేరలేదు. ఓ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ దూరమైన వెంటనే మరో సీనియర్ నేత మరణించడం బీజేపీని షాక్ కు గురి చేసింది. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, కేంద్రమంత్రిగా ఆయన సేవలు అన్యనసామాన్యం. వాజ్ పేయి మంత్రివర్గంలో, మోదీ మంత్రివర్గంలోనూ జైట్లీ కీలక బాధ్యతలు నిర్వహించారు..

అరుణ్ జైట్లీ 1952 డిసెంబర్‌ 28న ఢిల్లీలో జన్మించారు. 1977లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ పొందారు. విద్యార్థి దశలోనే ఏబీవీపీలో చేరారు. 1974లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో గెలిచారు. ఎమర్జెన్సీ కాలంలో 19 నెలల పాటు జైల్లో ఉన్నారు. జయ ప్రకాశ్ నారాయణ్ అనుచరుడిగా అవినీతి వ్యతిరేకోద్యమంలో పాల్గొన్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత జన్ సంఘ్‌లో చేరారు. 1980లో బీజేపీ యువజన విభాగం అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1987 నుంచి ఆయన సుప్రీం కోర్టుతో పాటు వేర్వేరు హైకోర్టుల్లో న్యాయవాదిగా పనిచేశారు. 2009లో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా నియమితులైన తర్వాత ఆయన న్యాయవాద వృత్తికి స్వస్తి చెప్పారు.

జైట్లీ పలుమార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1999లో వాజ్ పేయి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమాచార, ప్రసార శాఖ సహాయమంత్రిగా సేవలందించారు. పెట్టుబడుల ఉపసంహరణ శాఖామంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత కొద్ది కాలానికే న్యాయ, చట్ట, కంపెనీ వ్యవహారాల శాఖ అదనపు బాధ్యతలు స్వీకరించారు. 2009లో రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన తర్వాత ఆయన బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు. 2014లో మోదీ సర్కారు వచ్చిన తర్వాత ఆయన ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కొంతకాలం కార్పొరేట్ వ్యవహారాలు, రక్షణ శాఖను కూడా నిర్వహించారు. భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త రూపు ఇవ్వడంలో జైట్లీ కీలక భూమిక పోషించారు. ఆయన హయాంలోనే పెద్ద నోట్ల రద్దు జరిగింది. వస్తు..సేవల పన్ను జీఎస్టీ అమలుకు వచ్చింది. 2018 మే 14న జైట్లీకి కిడ్నీ మార్పిడి చికిత్స జరిగింది. అప్పటికే ఆయన కిడ్నీ పూర్తిగా దెబ్బతిన్నది. అమెరికా వెళ్లి చికిత్స కూడా చేయించుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close