ప్రత్యేకహోదాపై మెలిక పెట్టిన అరుణ్‌జైట్లీ

హైదరాబాద్: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై ఇవాళ లోక్‌సభలో స్పందించారు. హైదరాబాద్‌వంటి నగరాన్ని కోల్పోవటం ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద లోటే అని మంత్రి అంగీకరించారు. ఏపీ లోటు బడ్జెట్ పూడ్చటానికి, రాజధాని నిర్మాణానికి, పరిశ్రమల స్థాపనకు కేంద్రం సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. విభజనవల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని అంగీకరించారు. రాష్ట్ర అభివృద్ధికి ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టామని, మొదటి ఏడాది వీలైనంత సాయం అందించామని చెప్పారు. అభివృద్ధి అంశంలో ఏపీ తమకు ప్రధానమైనదని స్పష్టం చేశారు. విభజనవల్ల ఏపీకి జరిగిన నష్టాన్ని ఎంపీలు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఏపీని ఆర్థిక నష్టాలు అధిగమించేలా సహకరించటం తమ ఎజెండాలో ఉందని చెప్పారు. అభివృద్ధి రేటు 9కి చేరితే అన్ని రాష్ట్రాలకూ అభివృద్ధి ఫలాలు అందుతాయంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేకహోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందని చెప్పారు. అయినాకూడా దీనిపై నీతి ఆయోగ్(ప్రణాళికా సంఘం), ముఖ్యమంత్రుల సబ్ కమిటీ చర్చిస్తోందంటూ అసలు విషయం చెప్పకుండా దాటవేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కేకే , కడియం..!!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా కేసీఆర్ సన్నిహిత నేతలు కూడా హస్తం గూటికి చేరేందుకు...

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close