షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మేకప్ వేసుకుంటాడని అందరూ భావిస్తే తను మాత్రం అనూహ్యంగా మెగాఫోన్ పట్టుకున్నాడు. ఆర్యన్ దర్శకత్వం వహిస్తున్న తొలి ప్రాజెక్ట్ బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్. బాలీవుడ్ సినీ పరిశ్రమ తీరుతెన్నులను, వెనుక జరుగుతున్న డ్రామాలను చూపించే ఈ సిరీస్ సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
తాజాగా వచ్చిన ట్రైలర్ స్టార్స్‌తో నిండిపోయింది. తెరమీద అప్పుడప్పుడూ సర్ప్రైజ్ చేసే రాజమౌళి ఇందులో కనిపించడం విశేషం. ఆమీర్ ఖాన్ కూడా మెరిసాడు. అక్కడితో అయిపోలేదు, చివర్లో షారుఖ్ కూడా దిగారు. ఈ సిరీస్ లో మిగతా స్టార్స్ ని లెక్కపెట్టడం కూడా కష్టమే. మొత్తం బాలీవుడ్ అంతా ఆర్యన్ కోసం దిగింది.
బాలీవుడ్ సినిమాల అవకాశాలు, కథలు, వ్యక్తిగత జీవితాలు.. టైటిల్‌కు తగ్గట్టే బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్లో ఫిల్మ్ ఇండస్ట్రీ గ్లామర్ వెనక దాగి ఉన్న రియాలిటీని చూపించబోతోందని ట్రైలర్ హింట్ ఇచ్చింది. ట్రైలర్ చూశాక ఆర్యన్ డైరెక్టర్‌గా స్టార్ పవర్‌తో ఏదో ఒక కొత్త ప్రయోగమే చేశాడనిపిస్తోంది. ఆ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.