ఆశిష్‌పై దిల్ రాజు మ‌మ‌కారం

దిల్ రాజు సోద‌రుడి కుమారుడు ఆశిష్‌. ‘రౌడీ బోయ్స్‌’తో ఎంట్రీ ఇచ్చాడు. కుర్రాడు చూడ్డానికి బాగానే ఉన్నా, సినిమా మాత్రం దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ఆ త‌ర‌వాత సుకుమార్ బ్యాన‌ర్‌లో ‘సెల్ఫిష్‌’ ప‌ట్టాలెక్కింది. ఆ సినిమా కూడా అనుకోని కార‌ణాల వ‌ల్ల ఆగిపోయింది. ఇప్పుడు ‘ల‌వ్ మి’ అనే సినిమా రూపుదిద్దుకొంటోంది. ఈలోగా మ‌రో క‌థ ఆశిష్ కోసం రెడీ అవుతోంది. దిల్ రాజు బ్యాన‌ర్‌లో మ‌ర్చిపోలేని సినిమా.. ‘శ‌త‌మానం భ‌వ‌తి’. కుటుంబ ప్రేక్ష‌కుల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకొన్న ఈ చిత్రానికి సీక్వెల్ రెడీ అవుతోంది. ‘శ‌త‌మానం భ‌వ‌తి నెక్ట్స్ పేజీ’ అనే పేరుతో.

స‌తీష్ వేగ్నేశ‌ స్థానంలో హ‌రి అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌కుడిగా మార‌బోతున్నాడు. ఇప్పుడు హీరో కూడా మారిపోయాడు. ఈ సినిమా ఆశిష్ చేతికి వెళ్లింది. నిజానికి శ‌ర్వాని దృష్టిలో ఉంచుకొనే ఈ స్క్రిప్టు ప‌నులు మొదలెట్టారు. కానీ.. శిరీష్‌ని ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కి ద‌గ్గ‌ర చేయాలంటే `శ‌త‌మానం భ‌వ‌తి` లాంటి స‌బ్జెక్ట్ యాప్ట్ అని భావించిన దిల్ రాజు, ఈ ప్రాజెక్ట్ లోకి ఆశిష్‌ని తీసుకొచ్చారు. శ‌ర్వా అయితే… ఈ సినిమాకు మంచి హైప్ దొరికేది. సూప‌ర్ హిట్ సినిమా సీక్వెల్ కాబ‌ట్టి, మార్కెట్ ప‌రంగా మ‌రింత ఆస‌క్తి ఉండేది. కానీ మార్కెట్ లెక్క‌ల కంటే, ఆశిష్ కెరీర్‌కు ప్ల‌స్ అవ్వాల‌న్న ఆలోచ‌న‌తో దిల్ రాజు ఈ నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టు తెలుస్తోంది. హీరోగా ఆశిష్‌ని నిల‌బెట్టేంత వ‌ర‌కూ దిల్ రాజుకు ఈ త్యాగాలు త‌ప్ప‌వు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆ ఒక్కటీ అడక్కు’ రివ్యూ: క్లాసిక్ టైటిల్ చెడ‌గొట్టారు

Aa Okkati Adakku Movie review తెలుగు360 రేటింగ్ 2.25/5 -అన్వ‌ర్‌ ఒకప్పుడు అల్లరి నరేష్ నుంచి కామెడీ సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ వుండేది. తర్వాత పరిస్థితి మారింది. ఆయనపై కామెడీ కథలు సరిగ్గా...

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

ఏపీ ఉద్యోగుల చైతన్యం – 4 లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్స్ !

ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు... ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు....

గవర్నర్ పై లైంగిక ఆరోపణలు..!!

వెస్ట్ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై రాజ్ భవన్ లో పని చేసే మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగం పేరిట ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close