చంద్రబాబు ఐడియాను ఫాలో అయిన రాజస్థాన్ సీఎం…!

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తమ రాష్ట్రంలోకి సీబీఐ ఎంట్రీని బ్యాన్ చేశారు. ఈ మేరకు గతంలో ఉన్న జనరల్ కన్సెంట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం.. రాజస్థాన్ రాజకీయ సంక్షోభంలో ఉంది. తన ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ కుట్ర పన్నిందని.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆడియో రికార్డులను రాజస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో.. అక్రమంగా ఫో‌న్ ట్యాపింగ్ చేశారని… దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని.. చట్టాలను ఉల్లంఘించారని బీజేపీ నేతలు వాదించడం ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు కూడా ఫిర్యాదు చేశారు. అలా ఫిర్యాదు చేయగానే.. ఇలా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాజస్థాన్ ప్రభుత్వాన్ని వివరణ కూడా కోరింది. దీంతో.. సీబీఐని ఉపయోగించుకుని కేంద్రం.. తమను ఇబ్బంది పెడుతుందని భావించారేమో కానీ.. అశోక్ గెహ్లాట్ వెంటనే.. రాజస్థాన్‌లోకి సీబీఐ రాకుండా.. జనరల్ కన్సెంట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం ఆడియో టేపుల ఆధారంగా.. ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర పన్నారని కేసు నమోదు చేసిన.. రాజస్థాన్ పోలీసులు.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు.. నోటీసులు జారీ చేశారు. అవసరం అయితే.. అరెస్ట్ చేస్తామన్నట్లుగా మీడియాకు లీకులు ఇస్తున్నారు. ఇప్పటికే.. ఆ టేపుల్లో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కాంగ్రెస్ వారిపై కేసులు నమోదు చేసింది. వారి కోసం.. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ పోలీసులు వెదుకుతున్నారు. వారు బీజేపీ పాలిత రాష్ట్రంలో క్యాంపుల్లో ఉన్నారు. దాంతో వారిని పట్టుకోవడం కష్టమవుతోంది. అటు రాజస్థాన్ ప్రభుత్వం తమ పోలీసుల్ని ఉపయోగించుకుని ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనుకుంటోంది. సీబీఐ, ఐటీ లాంటి వాటితో.. రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చాలని.. బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు సీబీఐని రాజస్థాన్ లోకి రాకుండా.. గెహ్లాట్ చేయగలిగారు.

గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు.. ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత.. ఏపీలో ఐటీ దాడులు విస్తృతంగా జరిగాయి. టీడీపీలో వ్యాపారవేత్తలందరిపైనా సోదాలు జరిగాయి. ఆ తర్వాత సీబీఐని కూడా పంపబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. దాంతో చంద్రబాబునాయుడు.. ఏపీలోకి సీబీఐ ఎంట్రీని నిషేధిస్తూ.. జనరల్ కన్సెంట్ ను రద్దు చేశారు. అయితే.. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే.. మళ్లీ సీబీఐకి జనరల్ కన్సెంట్ ఇచ్చారు. ప్రభుత్వాలు జనరల్ కన్సెంట్‌ను రద్దు చేసినా.. కోర్టులు ఆదేశిస్తే మాత్రం.. ఎలాంటి అడ్డంకులు లేకుండా విచారణ జరుపుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close