తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. కొంత కాలంగా అశోక్ గజపతిరాజు పేరును గవర్నర్ పదవికి పరిశీలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రాష్ట్ర రాజకీయాల్లో సూపర్ క్లీన్ ఇమేజ్ ఉన్న నేత అశోక్ గజపతిరాజు. ఆయన సీనియార్టీకి తగ్గట్లుగా గవర్నర్ పదవి ఇప్పించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. బీజేపీకి కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. అాలగే రాజ్యసభ , ఎమ్మెల్సీ స్థానాలను కూడా బీజేపీకే కేటాయించారు. ఇతర పార్టీల నేతలకు గవర్నర్ పదవి కేటాయిచేందుకు బీజేపీ అగ్రనాయకత్వం అంతగా సుముఖత వ్యక్తం చేయదు. కానీ అశోక్ గజపతిరాజు క్లీన్ ఇమేజ్ , చంద్రబాబు ఒత్తిడి కారణంగా అవకాశం కల్పించారని అనుకోవచ్చు.
తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ కావడంతో ఆ పార్టీకి చెందిన నేతలెవరికీ ఇప్పటి వరకూ గవర్నర్ పదవులు దక్కలేదు. 2014లో ఎన్డీఏలో భాగంగా టీడీపీ ఉన్నప్పుడు.. మోత్కుపల్లి నర్సింహులుకు చాన్స్ ఇప్పింాలని చంద్రబాబు ప్రయత్నించారు. కానీ బీజేపీ నేతలు అంగీకరించలేదు. దాంతో మోత్కుపల్లి అసంతృప్తితో చంద్రబాబును ఇష్టం వచ్చిన తిట్లు తిట్టి తర్వాత ఎన్నికల్లో జగన్ కోసం ఏపీలో ప్రచారం చేశారు. ఇప్పించకపోవడమే మంచిది అయిందని తర్వాత టీడీపీ నేతలు అనుకున్నారు.
అశోక్ గజపతిరాజు గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. కుమార్తెకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారు. ఎంపీగా కలిశెట్టి అప్పల్నాయుడుకు మద్దతిచ్చి గెలిపించారు.