సంక్రాంతి వార్‌: కొత్త హీరోల భ‌విష్య‌త్తేమిటి?

ఈ సంక్రాంతికి 4 సినిమాలొచ్చాయి. అందులో కామ‌న్ పెద్ద సినిమా బంగార్రాజునే అయ్యింది. సూప‌ర్ మ‌చ్చీ గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. హీరో, రౌడీ బోయ్స్ సినిమాల్లో కామ‌న్ పాయింట్స్ చాలా ఉన్నాయి.

హీరో, రౌడీబోయ్స్‌.. ఈ రెండు సినిమాల్లోనూ హీరోల‌కు ఇదే తొలి సినిమా. హీరోతో అశోక్ గ‌ల్లా ఎంట్రీ ఇచ్చాడు. ఆయ‌న‌కు సినీ, రాజ‌కీయ నేప‌థ్యం ఉంది. రౌడీ బోయ్స్‌తో ఆశిష్ వ‌చ్చాడు. దిల్ రాజు ఇంటి నుంచి వ‌చ్చిన తొలి హీరో త‌ను. ఈ రెండు సినిమాల‌కూ బాగా ఖ‌ర్చు పెట్టారు. టెక్నిక‌ల్ గా సౌండ్ ఉన్న వాళ్ల‌ని ఎంచుకున్నారు. ఓ సినిమాలో అనుప‌మ‌, మ‌రో సినిమాలో.. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్లు, హీరోల‌తో పోలిస్తే.. ఇద్ద‌రూ స్టార్లే. సీనియ‌ర్లే. ఇద్ద‌రు హీరోలూ.. త‌మ హీరోయిన్ల‌కు లిప్ లాక్‌లు ఇచ్చేశారు. ఇలా.. చాలా కామ‌న్ పాయింట్స్ ఈ రెండు సినిమాల్లో క‌నిపిస్తాయి.

హీరోతో పోలిస్తే.. రౌడీ బోయ్స్ కి కాస్త పాజిటీవ్ ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. కాలేజీ నేప‌థ్యంలో ఉన్న సినిమా కావ‌డంతో.. కుర్రాళ్లు రౌడీ బోయ్స్ చూడ్డానికి ఇష్ట‌ప‌డుతున్నారు. దాంతో వ‌సూళ్లు కూడా రౌడీ బోయ్స్ కే ఎక్కువ‌. అయితే ఈ ఇద్ద‌రు హీరోల్లోనూ ఈజ్ బాగుంది. డాన్సులు బాగా చేస్తున్నారు. అశోక్ గ‌ల్లా మంచి క‌థ‌లు ఎంచుకుని, ఎక్స్‌ప్రెష‌న్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటే మంచి భ‌విష్య‌త్తు ఉంటుంది. ఇక ఆశీష్ న‌ట‌న‌లో కాస్త వీక్ గా క‌నిపిస్తున్నాడు. అశోక్ తో పోలిస్తే… డాన్సులు బాగా చేస్తున్నాడు. ఆశిష్ వెనుక దిల్ రాజు ఉన్నాడు కాబ‌ట్టి… క‌థ‌ల‌పై బెంగ లేదు. మంచి క‌థ‌ల్ని ఎంపిక చేసుకుని న‌ట‌న‌పై దృష్టి పెడితే… నిల‌బ‌డే ఛాన్సుంది. మొత్తానికి సినిమా ఫ‌లితాలు ఎలా ఉన్నా.. ఈ ఇద్దరూ ప్రామిసింగ్ గానే క‌నిపిస్తున్నారు. ఇద్ద‌రూ రెండో సినిమా ప్ర‌య‌త్నాల్లోనే ఉన్నారు. అందులో క్లిక్క‌యితే… భ‌విష్య‌త్తుకు పునాది ప‌డిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్ల‌రి న‌రేష్‌.. మ‌ళ్లీనా..?

ఈవీవీ మంచి ద‌ర్శ‌కుడే కాదు. నిర్మాత కూడా. ఈవీవీ సినిమా ప‌తాకంపై ఆయ‌న కొన్ని మంచి చిత్రాల్ని అందించారు. ఫ్లాపుల్లో ప‌డి స‌త‌మ‌త‌మ‌వుతున్న ఈవీవీకి... త‌న సొంత బ్యాన‌రే మ‌ళ్లీ నిల‌బెట్టింది. ఈవీవీ...

బీజేపీని టార్గెట్ చేసే స్టైల్ మార్చిన కేసీఆర్ !

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని ఇష్టారీతిన విమర్శించడమే ఇప్పటి వరకూ బీజేపీపై చేస్తున్న యుద్దంగా భావించేవారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు స్టైల్ మార్చారు. వికారాబాద్‌లో కలెక్టరేట్ భవనాలను ప్రారంభించిన ఆయన......

“ఆ ప్రశ్న” అడిగితే అసహనానికి గురవుతున్న జనసేన !

మంత్రి అంబటి రాంబాబుపై జనసేన పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఆయనపై రకరకాల పద ప్రయోగాలు చేస్తూ మండి పడుతున్నారు. అంబటి రాంబాబును బపూన్‌ను చేస్తూ.. ఆయన ఫోటోను మార్ఫింగ్ చేసి మరీ...

లెక్కల్లేవ్ ..అయినా ఏపీని అలా వదిలేశారేంటి !?

ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నంత మాత్రాన వారికి రాసిచ్చినట్లు కాదు. ఏదైనా రాజ్యాంగ పరంగా చేయాలి. ప్రజలు పన్నులు కట్టగా వచ్చే డబ్బును.. వారిని చూపించి చేసే అప్పును.. పద్దతిగా వాడాలి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close