గుడ్ న్యూస్- ప్లాంట్ రీఓపెన్ కు అశోక్ లేలాండ్ ఓకే!

అమ‌రావ‌తిని రాజ‌ధాని కాదు అని ప్ర‌భుత్వం… అప్ప‌టికే పెట్టుబ‌డి పెట్టిన కంపెనీల‌పై స్థానిక వైసీపీ నాయ‌కుల బెదిరింపు ధోరిణి… స‌హ‌క‌రించ‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు… అన్నీ క‌లిసి రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతంలో గ‌తంలో వ‌చ్చిన కంపెనీలు సైతం జ‌గ‌న్ హ‌యంలో వెన‌క్కి వెళ్లాయి.

కృష్ణా జిల్లాలోని బాపుల‌పాడు మండ‌లంలోని మ‌ల్ల‌వ‌ల్లిలో అశోక్ లేలాండ్ కంపెనీ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. ఇక్క‌డున్న పారిశ్రామికవాడ‌లో భూమిని కేటాయించి, కంపెనీని తీసుకొచ్చింది ఆనాటి చంద్ర‌బాబు స‌ర్కార్.

అయితే, గ‌త వైసీపీ స‌ర్కార్ ఉదాసీన‌త వ‌ల్ల ప్లాంట్ మూసివేశారు. దీంతో ఇప్పుడు ఆ ప్లాంట్ ను రీఓపెన్ చేసేందుకు ఏపీ స‌ర్కార్ తో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు కంపెనీ ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని రాసిన లేఖ‌కు కంపెనీ ఎండీ ధీర‌జ్ జి. హిందూజాకు రిప్లై ఇచ్చారు. అక్క‌డ బ‌స్సు బాడీ బిల్డింగ్ ను ప్రారంభించేందుకు కంపెనీ సిద్ధంగా ఉంద‌ని వెల్ల‌డించారు.

Also Read : 40 రోజుల్లో నాలుగుసార్లు.. జగన్ బెంగళూరు పర్యటనల సారాంశం ఏంటి?

బ‌స్సు బాడీ బిల్డింగ్ ప్లాంట్ కు సంబంధించి త‌మ కంపెనీ ప్ర‌తినిధులు త్వ‌ర‌లోనే రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ ను క‌లుస్తార‌ని, ఆయ‌న‌తో అన్ని విష‌యాలు మాట్లాడిన త‌ర్వాత ప్రారంభానికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాంతంతో పాటు చుట్టు ప్ర‌క్క‌ల ప్రాంతాల్లో పెట్టుబ‌డుల‌కు సానుకూల వాతావ‌ర‌ణం క‌నప‌డుతోంది. కొత్త‌గా పెట్టుబ‌డులు పెట్టే వారికి ప్ర‌భుత్వం త‌ర‌ఫున భూమి ఇవ్వ‌టం, ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయ‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో… వెన‌క్కి పోయిన కంపెనీల‌తో పాటు కొత్త కంపెనీలు కూడా ఏపీకి వ‌చ్చేందుకు ఆస‌క్తిక‌న‌ప‌రుస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close