శౌర్య‌ని కాపాడిన శాటిలైట్‌

న‌ర్త‌న‌శాల నుంచి తేరుకోవ‌డానికి, ఆ ల‌గేజీని భుజాల‌పై నుంచి దింపుకోవ‌డానికి నాగ‌శౌర్య చాలానే క‌ష్ట‌ప‌డ్డాడు. న‌ర్త‌న‌శాల‌ని ప్రేక్ష‌కులంతా మ‌ర్చిపోవాల‌న్న కృత‌నిశ్చ‌యంతో ఈసారి ఇంకాస్త స‌మ‌యం తీసుకుని, ఇంకాస్త మ‌న‌సు పెట్టి తీసిన సినిమా ‘అశ్వ‌ద్ధామ‌’. మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అకృత్యాల‌పై ఓ యువ‌కుడి పోరాటం ఈ క‌థ‌. రాక్ష‌సుడులా ఓ థ్రిల్ల‌ర్‌గా మ‌లిచి, హిట్టు కొట్టాల‌ని శౌర్య విశ్వ ప్ర‌య‌త్న‌మే చేశాడు. త‌న ప్ర‌య‌త్నం బాగున్నా – చిన్న చిన్న లోపాల వ‌ల్ల అనుకున్న స్థాయిని అందుకోలేక‌పోయింది. ఈ సినిమాపై దాదాపుగా 10 కోట్లు ఖ‌ర్చు పెట్టారు. బాక్సాఫీసు రిజ‌ల్టు చూస్తే ఆ డ‌బ్బులు వెన‌క్కి రావ‌డం క‌ష్టంగానే అనిపిస్తోంది. అయితే శాటిలైట్‌, డిజిట‌ల్ రూపంలో మంచి డ‌బ్బులే వ‌చ్చాయి నిర్మాత‌కు. జెమినీ టీవీ 2.5 కోట్ల‌కు ఈ సినిమా శాటిలైట్ సొంతం చేసుకుంది. హిందీ డ‌బ్బింగ్ రైట్స్ రూపంలో 1.75 కోట్లు వ‌చ్చాయి. అలా దాదాపు స‌గం డ‌బ్బులు విడుద‌ల‌కు ముందే రాబ‌ట్టుకోగ‌లిగారు. `న‌ర్త‌న శాల‌` త‌ర‌వాత శౌర్య సినిమా ఈ స్థాయిలో డిజిట‌ల్ రైట్స్ ద‌క్కించుకోవ‌డం విశేష‌మే. ఫైట్లు భారీగా ఉన్నాయి కాబ్ట‌టి హిందీ డ‌బ్బింగ్ రైట్స్ కూడా బాగానే ముట్టాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close