చైతన్య : టార్గెట్ ఎర్రన్న కుటుంబం..! ఇది రామ్మోహన్ నాయుడిపైన గురే..!

ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే ఓ పద్దతి ఉంటుంది. ముందుగా నోటీసులు ఇస్తారు. విచారణకు పిలుస్తారు. పోలీసులు అడిగిన వాటికి సమాధానాలు చెప్పకపోతే.. అవినీతి జరిగినట్లుగా ఆధారాలుంటే.. అరెస్ట్ చేస్తారు. కానీ అచ్చెన్నాయుడు అరెస్టులో మాత్రం.. ఏపీ సర్కార్ సొంత చట్టాన్ని అమలు చేసింది. తెల్లవారక ముందే వందల మంది పోలీసుల్ని ఇంటి మీదకు పంపించి.. అప్పటికీ అచ్చెన్నాయుడేదో… దేశం విడిచిపారిపోతాడాన్నట్లుగా షో చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఓ ఎమ్మెల్యే.. ఓ మాజీ మంత్రి.. ఓ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత.. ఇలా అనేక రకాల ప్రివిలేజెస్ ఉన్న ఆయనను… పోలీసులు ఎలాంటి నిబంధనలు లేకుడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అంత కంటే ముఖ్యం.. ఆయనకు ఒక రోజు ముందే.. మైనర్ సర్జరీ జరిగింది. ఆయన మెడికల్ రెస్ట్‌లో ఉన్నారు. ఇవన్నీ తీసి పక్కన పెడితే.. అసలు అచ్చెన్నాయుడుని ఎందుకు టార్గెట్ చేశారన్నది కీలకం.

రెండు వారాల నుంచి రామ్మోహన్ నాయుడిపై గురి..!

గత పది… పదహేను రోజులుగా… వైసీపీ నేతల రాజకీయం చూస్తే.. పూర్తిగా ఎర్రంనాయుడు కుటుంబంపై దృష్టి పెట్టినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ సోషల్ మీడియా టీం.. ఒక్క సారిగా ఫేక్ వార్తలను లైవ్‌లోకి తీసుకు రావడం ప్రారంభించింది. అది..రామ్మోహన్ నాయుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అవడం గురించి. చంద్రబాబు రామ్మోహన్ నాయుడును ఏపీ టీడీపీ అధ్యక్షుడ్ని చేస్తున్నారని లోకేష్ వ్యతిరేకించాడని.. ఏదేదో జరుగుతోందని ఆ ఫేక్ న్యూస్ సారాంశం. వారు అలా ఆ పోస్టులను సర్క్యూలేషన్‌లో పెట్టగానే.. వైసీపీ సోషల్ మీడియా హెడ్.. విడయసాయిరెడ్డి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో రామ్మోహన్ నాయుడుపై దాడి ప్రారంభించారు. అది అలా కొనసాగుతూనే ఉంది. అంటే… రెండు వారాల కిందటి నుంచే… రామ్మోహన్ నాయుడు…పై గురి పెట్టారన్నమాట.

ఇప్పుడు అచ్చెన్నాయుడి ఆకస్మిక అరెస్ట్..!

రామ్మోహన్ నాయుడు ఎర్రన్న కుమారుడు. మచ్చలేని చరిత్ర ఆ కుటుంబానిది. ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంటున్నారు కానీ.. వారు ధనవంతులని మాత్రం ఎవరూ చెప్పరు. అవినీతికి పాల్పడతారని కూడా ఎవరూ చెప్పరు. ఎర్రన్నాయుడు, రామ్మోహన్ నాయుడు సోదరులు ఇప్పటికీ ఉద్యోగాలు చేసుకుంటూనే ఉంటారు. వారి అవినీతి పరులను ఇంత వరకూ విమర్శించిన వారు కూడా లేరు. కానీ ఈఎస్‌ఐ స్కాంలో ఫార్మాలిటీగా రాసిన ఓ లేఖను ఆధారంగా చేసుకుని అవినీతికి పాల్పడ్డారని అరెస్ట్ చేశారు. అవినీతికి పాల్పడటం అంటే… అక్రమ ఆస్తులు పోగేసుకుని దొరికిపోవడం. ఏపీలో ఇప్పుడు ముఖ్య పొజిషన్లలో ఉన్న వారు అలా దొరికిపోయి జైలుకెళ్లినవారే. కానీ అచ్చెన్నాయుడు అలాంటి ఆస్తులు ఉన్నాయని ఏసీబీ చెప్పలేదు. అవినీతికి పాల్పడినట్లుగా ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారు.

ఏపీ టీడీపీ అధ్యక్షుడు కాకుండా.. రామ్మోహన్‌నాయుడ్ని అడ్డుకోవడమే లక్ష్యమా..?

ఎర్రన్నాయుడు కుటుంబాన్ని వీలైనంతగా తొక్కేయడమే లక్ష్యమని రాజకీయాలను చూసే ఎవరికైనా అర్థమైపోతుంది. రామ్మోహన్ నాయుడు.. నిండా మూడు పదులు నిండిన యువకుడైన నేత. అంతే కాదు..ఎర్రన్న మృతితో అకస్మాత్‌గా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చినప్పటికీ.. ఆయన చాలా త్వరగా విషయ పరిజ్ఞానాన్ని పొందారు. ఇప్పుడు ఏ అంశంపైనైనా అనర్ఘళంగా మాట్లాడగల సామర్థ్యం ఉంది. ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఆయన భవిష్యత్ నేత అయితే.. తమకు గడ్డు పరిస్థితి ఎదురవుతుంది.. ఉత్తరాంధ్ర నుంచి బలమైన నాయకత్వం రాకుండా చేయాలన్న లక్ష్యంతోనే.. వైసీపీ సర్కార్.. ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసి.. మానసికంగా ఇబ్బంది పెట్టే లక్ష్యంతోనే ఈ తరహా ప్రయత్నాలు చేస్తోందని సులువుగా అర్థం చేసుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌ణిర‌త్నంతో సూర్య‌

మ‌ణిర‌త్నం - సూర్య‌... సూప‌ర్ కాంబినేష‌న్‌. యువ సినిమాతో వీరిద్ద‌రూ మ్యాజిక్ చేశారు. ఇప్పుడు మ‌రోసారి క‌ల‌సి ప‌నిచేయ‌బోతున్నారు. సినిమా కోసం కాదు. వెబ్ సిరీస్ కోసం. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క సార‌థ్యంలో...

ముద్రగడ ని వదలని సోషల్ మీడియా

ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం నుండి తాను తప్పుకుంటున్నాను అంటూ నిన్న రాసిన లేఖ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. గత చంద్రబాబు హయాంలో ప్రభుత్వాన్ని కొన్నిసార్లు ఉక్కిరిబిక్కిరి చేసిన...

పవన్ ని పొగిడిన అలీ, అప్పటి మాటలను గుర్తు చేసిన జన సైనికులు

కమెడియన్ ఆలీ కి, పవన్ కళ్యాణ్ కి మధ్య ఒకప్పుడు ఉన్న సన్నిహిత సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకానొక సందర్భంలో, " ఆలీ లేకుండా నీవు సినిమా తీయలేవా " అని...

“కూల్చివేత” ఆపేందుకు ఎన్జీటీకి రేవంత్..!

తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేతను అడ్డుకునేందుక టీ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి... రంగంలోకి దిగారు. ఆయన నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌లో పిటిషన్ వేశారు. సెక్రటేరియట్ కూల్చివేత వల్ల.. పర్యావరణానికి తీవ్రమైన హాని జరుగుతుందని...

HOT NEWS

[X] Close
[X] Close