అల్లు అర్జున్ దగ్గర మరో తమిళ దర్శకుడు?

యువ తమిళ దర్శకులది ఓ దారి అయితే… తెలుగుమ్మాయ్ కృష్ణప్రియాను పెళ్లి చేసుకున్న అట్లీది మరోదారి. అక్కడి యువ దర్శకులు కొత్త కొత్త కథలతో సినిమాలు తీస్తుంటే… అట్లీ తెలుగు దర్శకుల తరహాలో కమర్షియల్ ఫార్మటులో సినిమాలు తీస్తున్నాడు. తొలి సినిమా ‘రాజా రాణి’లో ట్రీట్మెంట్ కొత్తగా వుంటుంది. ఇక, తెలుగులో ‘పోలీస్’గా విడుదలైన ‘తెరి’, ‘అదిరింది’గా వచ్చిన ‘మెర్సల్’ సినిమాలు రొటీన్ కమర్షియల్ సినిమాలే. అభిమానులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీసే ఈ దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా చేయనున్నాడని సమాచారమ్. “నా తదుపరి సినిమా తెలుగు వుంటుంది. ప్రముఖ తెలుగు హీరో అందులో నటిస్తారు. ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయి. అందుకని, అందరూ కొన్ని రోజులు వెయిట్ చేయండి” అని అట్లీ పేర్కొన్నారు. అతడు డిస్కషన్ చేస్తున్నది అల్లు అర్జున్‌తోనే అట! డిస్కషన్స్ ఏ తీరానికి చేరతాయో? మొన్నామధ్య తమిళ దర్శకుడు లింగుస్వామి చాలారోజులు బన్నీతో సినిమా గురించి డిస్కస్ చేశాడు. చెన్నైలో సినిమా ఓపెనింగ్ జరిగింది. తెలుగు, తమిళ భాషల్లో సినిమా తీయాలనుకున్నారు. కానీ, ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదు. అట్లీ అయినా బన్నీ దగ్గర సినిమాను ఒకే చేయించుకుంటాడో? లేదో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీలో ప్లాన్డ్‌గా చిచ్చు పెట్టేసిన కేటీఆర్..!

తెలంగాణ బీజేపీలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ బీజేపీలో ముసలం ప్రారంభమయింది. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు ముఖ్య నేతలపై చర్యలు తీసుకోవాలని..  బీజేపీ హైకమాండ్‌ను బండి సంజయ్ గట్టిగా కోరుతున్నారు. అందులో ఎమ్మెల్సీగా పోటీ...

చ‌ర‌ణ్ ముందు రెండు ఆప్ష‌న్లు పెట్టిన శంక‌ర్

ఎన్ని అవాంత‌రాలు వ‌చ్చినా రామ్ చ‌ర‌ణ్ తో ప్రాజెక్టు ని వీలైనంత ముందుకు తీసుకెళ్లాల‌ని భావిస్తున్నాడు శంక‌ర్‌. రామ్ చ‌ర‌ణ్‌తో శంక‌ర్ ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. `భార‌తీయుడు...

ర‌వితేజ‌తో హ‌రీష్ శంక‌ర్‌?

'షాక్‌'తో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చినా, త‌న త‌డాఖా మాత్రం `మిర‌ప‌కాయ్‌`తో బ‌య‌ట‌పెట్టాడు హ‌రీష్ శంక‌ర్‌. గ‌బ్బ‌ర్ సింగ్‌తో క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌గా ఎదిగిపోయాడు. ఆ త‌ర‌వాత త‌న ప్ర‌స్థానం తెలిసిందే. ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్...

కొంప ముంచిన సాగర్ సభ..!

నాగార్జున సాగర్ ఎన్నికల ప్రచారం.. కరోనా హాట్ స్పాట్‌గా మారిపోయింది. సీఎం కేసీఆర్ సహా... టీఆర్ఎస్ ముఖ్య నేతలందరికీ ఆ సభ ద్వారానే కరోనా సోకినట్లుగా అంచనా వేస్తున్నారు. సీఎం కేసీఆర్ అన్ని...

HOT NEWS

[X] Close
[X] Close