త‌ప్ప‌తాగి ప‌డిపోయిన క్రికెట‌ర్‌

మాక్స్ వెల్.. ప్ర‌పంచ క్రికెట్ కు ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని పేరు. ఆస్ట్రేలియా జ‌ట్టుకు ఎన్నోసార్లు ఒంటి చేత్తో విజ‌యాల్ని అందించాడు. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో మాక్స్ వెల్ చేసిన అద్భుత ద్విశ‌త‌కం ఇప్ప‌ట్లో ఎవ‌రూ మ‌ర్చిపోరు. అలాంటి మాక్స్ వెల్ క్రికెట్ ఆస్ట్రేలియా త‌ల‌దించుకొనేంత ప‌ని చేశాడు. ఓ పార్టీలో త‌ప్ప‌తాగి ప‌డిపోయాడు. స్పృహ కోల్పోయిన మాక్స్ వెల్ ని ఆసుప‌త్రికి త‌ర‌లించాల్సివచ్చింది. అడిలైడ్ లో జ‌రిగిన ఓ సంగీత విభావ‌రిలో పాల్గొన్న మాక్స్ వెల్ అక్క‌డ ఫుల్లుగా మ‌ద్యం సేవించాడు. ఆ త‌ర‌వాత స్పృహ త‌ప్పి ప‌డిపోయాడు. మాక్సిని లేప‌డానికి స‌న్నిహితులు ఎంత ప్ర‌య‌త్నించినా సాధ్యం కాలేదు. చివ‌రికి అంబులెన్స్ స‌హాయంతో మాక్సిని ఆసుప‌త్రికి త‌ర‌లించాల్సివ‌చ్చింది.

ఈ ఘ‌ట‌న‌పై క్రికెట్ ఆస్ట్రేలియా సీరియ‌స్ అయ్యింది. ఓ ప‌బ్లిక్ ఫంక్ష‌న్‌లో మాక్స్‌వెల్ ఇలా ఎందుకు ప్ర‌వ‌ర్తించాడంటూ.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ క‌మిన్స్ కూడా ఈ ఘ‌ట‌న‌పై విచారం వ్య‌క్తం చేశాడు. ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌క్కూడ‌ద‌ని, ప్ర‌జలంతా గ‌మ‌నిస్తున్నార‌ని, ఎవ‌రు తీసుకొనే నిర్ణ‌యాల‌కు, ఎవ‌రు చేసిన త‌ప్పుల‌కు వాళ్లే బాధ్యుల‌ని ప‌రోక్షంగా మాక్సిని హెచ్చ‌రించాడు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇలాంటి విష‌యాల్లో చాలా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తుంటుంది. ఆట‌గాళ్లు క్ర‌మిశిక్ష‌ణ త‌ప్పితే.. ఉపేక్షించ‌దు. మాక్స్ వెల్ విష‌యంలోనూ బోర్డు ఓ క‌ఠిన నిర్ణ‌యం తీసుకొంటుంద‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాలో జ‌రుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో మాక్స్ ఆడుతున్నాడు. త‌న జ‌ట్టుని ప్లే ఆఫ్ చేరుకోవ‌డంలో విఫ‌లం అయ్యింది. దానికి తోడు వెస్టిండీస్ తో జ‌ర‌గ‌బోయే సిరీస్ లో మాక్స్ జ‌ట్టులో చోటు కోల్పోయాడు. ఆ బాధ‌లో మాక్స్ వెల్ త‌ప్ప‌తాగి ఇలా ప్ర‌వ‌ర్తించాడ‌నికి స‌న్నిహిత వ‌ర్గాలు భావిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close