అవంతిక రేప్ `కేసు’… శివుడిపై `అభియోగాలు’

అందాల అవంతిక, సోగ్గాడు శివుడు. ఈ పేర్లు ఇప్పుడు ప్రపంచమంతటా మారుమ్రోగుతున్నాయి. వివరణ ఏమీ చెప్పకుండానే బాహుబలి సినిమాలోని ఈ పాత్రలు మన కళ్లముందు కదలాడతాయి. ఇప్పుడు ఈ రెండు పాత్రలమీద హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది. ఊహాతీత పాత్రలను కోర్టుకు ఈడ్చే ప్రయత్నాలకు బీజంపడింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన భారీ బడ్జెట్ బహుభాషా చిత్రం `బాహుబలి’ వసూళ్ల రారాజుగా నిలవడమే కాదు మరోవైపున నెమ్మదినెమ్మదిగా వివాదాలబాట కూడా త్రొక్కుతోంది. తమిళనాడులోని మధురైలో దళిత సంస్థ (తమిళ పులి) ఈ సినిమాలో అభ్యంతరకరమైన సీన్లు, డైలాగ్ లు ఉన్నాయంటూ నిరసన తెలుపుతోంది. బాహుబలి ఆడుతున్న సినిమా థియేటర్ దగ్గర పెట్రోల్ బాంబులు కూడా విసిరేసి ఈ సంస్థ కార్యకర్తలు తమ నిరసన తీవ్రతను చాటిచెప్పారు. దళితులను అవమానించే విధంగా కొన్ని సీన్లు, డైలాగ్ లు ఉన్నాయన్న వాదనను ఇతర రాష్ట్రాల్లోని ఎస్.సీ, ఎస్.టీ లకు చెందిన సంస్థలు బలపరుస్తున్నాయి కూడా.
ఇది ఇలాఉంటే, మరో వైపు సినిమాలోని పాత్రల మధ్య అసభ్యకరమైన సీన్లు ఉన్నాయంటూ మహిళా జర్నలిస్ట్ అన్నా వెటికాడ్ రాసిన వ్యాసం ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. బాహుబలి సినిమాలో అవంతిక, శివుడు మధ్య కొనసాగిన రొమాంటిక్ సీన్ యువతను కట్టిపడేసినమాట నిజమే. ఆ పాటలో తమన్నా అందచందాలతోపాటు ప్రకృతి సౌందర్యం ఆరబోసినమాట కూడా నిజమే. అంతే స్థాయిలో అమ్మాయి వెంటబడే సోగ్గాడు శివుడి పాత్రలో ప్రభాస్ కూడా లీనమయ్యాడు. అయితే, పాత్రల చిత్రీకరణలో సామాజిక విలువలూ, కట్టుబాట్లు, మహిళా వ్యక్తిత్వం వంటి వాటిని దర్శకుడు తుంగలో తొక్కేశారన్న వాదనకు రాజమౌళి ఎలా సర్దిచెబుతాడో చూడాలి. ఈ మహిళా జర్నలిస్ట్ వాదన ఏమంటే, అందాల రాశి అవంతికను శివుడు రేప్ చేశాడని.
ఊహాజనితమైన అవంతిక రేప్ (మానభంగం)కు గురైందనడానికి అన్నా వెటికాడ్ తన వ్యాసంలో శివుడిపై అనేక అభియోగాలు మోపారు. అందులో కొన్ని…

1. చేతిపై పచ్చబొట్టు వేయడం :
ప్రేమ అన్నది ఇరువైపులా అంగీకారమైనప్పుడు పచ్చబొట్టువేసుకోవడం తప్పేమీకాకపోవచ్చు. కానీ ఒక అపరిచితుడైన యువకుడు ఒక అందాలరాశిని చూసి మోహంలో పడి ఆమె నిద్రావస్థలో ఉన్నప్పుడు దొంగచాటుగా వచ్చి ఆమె చేతిపై పచ్చబొట్టు వేయడమేమిటి ? అవంతిక మేలుకోగానే తన చేతిపై ఉన్న పచ్చబొట్టు చూసి ఎవరు ఈ పనిచేశారో తెలియక అయోమయంలో పడిపోతుంది.

2. బట్టలు ఊడదీయడం:
ఈ తుంటరి యువకుడు అక్కడితో ఆగలేదు, ఆమెను ప్రేమలోకి దింపడంకోసం ఒక సందర్బంలో ఆమె వేసుకున్న పైదుస్తులు వొలిచేశాడు. అప్పటివరకు అవంతిక ఒక కర్తవ్యాన్ని నిర్వహించే దీక్షలో యోధురాలి దుస్తులు వేసుకుని ఉంటుంది. అయితే శివుడు ఆమెను కవ్విస్తూనే ఆమె ఒంటిపై ఉన్న పై దుస్తులు తొలగించివేస్తాడు. లోపల వేసుకున్న దుస్తులతో సౌందర్యాన్ని గుర్తుతెచ్చే ప్రయత్నం చేస్తాడు. చివరకు ఆమె రవిక ముడిని విప్పదీస్తాడు. ఆమె నుంచి ఎలాంటి అంగీకారం రాకుండానే బట్టలు ఊడదీయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ?

3. భయభ్రాంతులకు గురిచేస్తూనే… :
అవంతికను ప్రేమలో పడేయడంకోసం శివుడు మరో ప్రయోగం చేస్తాడు. ఈసారి ఆమె భుజం దగ్గర పచ్చబొట్టు వేయడంకోసం తాను పట్టితెచ్చిన పాముని ఆమెపైకి ఉసిగొల్పుతాడు. దీంతో ఆమె భయభ్రాంతులై స్థానువుగా నిలబడిపోతుంది. అదే అదును అనుకున్న శివుడు మరోసారి ఆమె ఒంటిపై పచ్చబొట్టువేస్తాడు. అప్పటికీ ఆతను ఆమెకు అపరిచితుడే. తీరా భ్రాంతి తొలిగిన తర్వాత తన భుజంమీద పచ్చబొట్టు ఉండటం చూసి ఆ పని ఎవరు చేశారా !? అన్నట్టు చుట్టూ చూస్తుంది. కానీ ఎవరూ కనబడరు. అంటే పూర్తిగా అపరిచుడైనవ్యక్తి తన అనుమతి లేకుండా తన ఒంటిపై పచ్చబొట్టువేయడం అది కూడా రెండోసారి… అలా చేయడాన్ని ఏ స్త్రీ అయినా ఎలా అర్థం చేసుకుంటుంది? ఆమెను భయభ్రాంతులకు గురిచేసి తన పని చక్కబెట్టుకోవడం రేప్ లో ఒక భాగం కాదా ?

4. నచ్చిన రీతిలో ఆమె శరీరాన్ని మలచడం:
ప్రేమ మొగ్గ వికసించకముందే, అవంతికపై శివుడు పూర్తి అధికారమున్నట్టు ప్రవర్తిస్తాడు. శృంగార పాటగా చెప్పుకునే `పచ్చ బొట్టేసినా పిల్లవాడా..’ అంటూ అవంతిక పాట ఎత్తుకోగానే శివుడు ఇక రెచ్చిపోతాడు. తన తెలివితేటలతో ఆమెలోని అందాలు ఆమెకే చూపించే ప్రయత్నం చేస్తాడు. ఆమె జట్టు ముడి విడదీస్తాడు, ఆమె పెదవులకు సాహజసిద్ధమైన రంగును పులుముతాడు, కళ్లకు కాటుక తీర్చిదిద్దుతాడు. దీంతో యోధురాలి రూపం చెదిరిపోయి, సౌందర్యదేవత సాక్షాత్కరించినట్టు చిత్రంలో చూపిస్తారు. చివరకు అతనితో పాడుతూ, నృత్యం చేస్తూ ఆఖరికి అతని బాహుబంధాల్లో ఒదిగిపోతుంది. ఇవన్నీ మహిళను లొంగదీసుకోవడానికి చేసే ప్రయత్నాలు కావా ?
ఈ తరహా అభియోగాలు మరికొన్ని కూడా జర్నలిస్ట్ అయిన అన్నా వెటికాడ్ తన వ్యాసంలో రాశారు. నిద్రపోతున్న మహిళకు తెలియకుండా శృంగార చేష్టలు చేయడం రేప్ కిందకే వస్తుందన్నది ఆమె వాదన. 2011లో విడుదలైన హిందీ చిత్రం `తను వెడ్స్ మను’లోని ఒక సన్నివేశాన్ని ఆమె ఈ వ్యాసంలో ఉటంకించారు. తప్పతాగిన స్థితిలో తను అనే యువతి తన పడకగదిలో పడుకునిఉంటే, మను అనే యువకుడు వచ్చి మోహంతో ఆమెను కిస్ చేస్తాడు. సినిమా చూసిన చాలా మంది కథలో లీనమై ఆ సీను ఎంతటి చెడు ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోలేకపోయారు. అలాగే బాహుబలిలో చక్కటి నేపథ్యం, ఆపైన ఇంపైన సంగీతం…వీటిలో తన్మయం చెందుతూ అసలు శివుడు చేస్తున్న రేప్ సీన్ సంగతి ప్రేక్షకులు పట్టించుకుని ఉండకపోవచ్చు.
ఇలాంటి సీన్లు మన ఇంట్లోనో, లేదా మనకు తెలిసిన వారి ఇళ్లలోనో జరిగితే ఊరుకోగలమా ? చెల్లెలో, కూతురో పడకగదిలో పడుకుని ఉంటే ఒక అపరిచితుడు నేరుగా లోపలకి దూరేసి ముద్దుపెడితే, లేదా ఇంకేదైనా వెకిలి చేష్టలు చేస్తే ఊరుకుంటామా, తన్ని తగలేయమా? మరి సినిమాలో ఇలాంటి పోకడలను ఎందుకని ఉపేక్షిస్తున్నామన్నది అన్నా వెటికాడ్ వాదన.
బాహుబలిలో ఇలాంటి సన్నివేశాలుంటే సెన్సార్ బోర్డ్ మాత్రం – కుటుంబంతో కలసి చూడదగ్గ చిత్రంగా సర్టిఫికేట్ ఇవ్వడం ఏమిటన్నది మరో ప్రశ్న. సినిమా కేవలం వినోదాన్నేకాదు, సమాంజంలో విశేష ప్రభావితం చూపుతుంది. మంచీచెడుల విచక్షణలేకుండా తీసే సినిమాలవల్ల సమాజానికి కచ్చితంగా కీడు జరుగుతుందన్న వాదనను బలంగా నమ్మేవారు ఇప్పుడొచ్చిన బాహుబలిలోని అవంతిక, శివుడు పాత్రల మధ్య సాగిన సీన్ల వ్యవహారం గురించి కూడా పట్టించుకోవాల్సిందే. ఇప్పటికే దళితుల ఆగ్రహం చవిచూస్తున్న సినిమా ఇప్పుడు మహిళల ఆగ్రహం కూడా చవిచూడబోతున్నదా… ? ఏమో వేచిచూద్దాం.

– కణ్వస

 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close