పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక వైసీపీకి తిప్పలు తెచ్చి పెడుతోంది. ఇంత కాలం ఓట్లేయకుండా ఏకగ్రీవాలు చేసుకున్న చోట ఇప్పుడు పోటీ పడాల్సి వస్తోంది. ఏం జరుగుతుందో అని కంగారు పడుతున్నారు. ఓడిపోతే పరువుపోతుంది. అందుకే కారణాలు వెదుక్కునేందుకు రోజుకో గొడవ సృష్టించి.. పోలీసుల దుర్వినియోగం అనే కబుర్లు చెబుతున్నారు
ఇటీవల నల్లగొండువారిపల్లె అనే గ్రామంలో వైసీపీ నేతలు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా టీడీపీ నేతలకు పోటీగా ప్రచారం చేసేందుకు వెళ్లడంతో ఘర్షణ జరిగింది. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరుగుతూ ఉంటాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతూ ఉంటుంది. అలాంటి గ్రామాల్లో ఇప్పుడు టీడీపీ ప్రచారం చేస్తూండటంతో అవినాష్ రెడ్డి తట్టుకోలేకపోతున్నాడు. ఘర్షణలు జరుగుతాయన్న ఉద్దేశంతో. పోలింగ్ కేంద్రాలను అధికారులను మార్చారు. నల్లగొండు వారి పల్లె నుంచి పక్క గ్రామానికి మార్చారు. దానికి అవినాష్ రెడ్డి ఫీలవుతున్నారు.
పోలింగ్ కేంద్రాలు ఎక్కడ ఉన్నవి అక్కడే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు నాలుగు కిలోమీటర్ల దూరం మారుస్తున్నారని ఓటర్లు అంత దూరం వెళ్లి ఓటేయాలా అని ప్రశ్నిస్తున్నారు. ఓటర్లు దుబాయ్ లో ఉన్నా తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్న వైసీపీ.. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న వారిని తీసుకొచ్చి ఓట్లేయించుకోవడం పెద్ద సమస్య కాదు. కానీ తమకు రిగ్గింగ్ చాన్స్ పోతుందని అవినాష్ రెడ్డి భయపడుతున్నారు.