వివేకానందరెడ్డి హత్య కేసులో తన తండ్రి భాస్కర్ రెడ్డిని ఊహించని విధంగా అరెస్ట్ చేశారని అవినాష్ రెడ్డి షాక్ కు గురయ్యారు. తండ్రి అరెస్ట్ తర్వాత ఎక్కడా కనిపించని ఆయన మధ్యాహ్నం సమయంలో పులివెందులలో ప్రత్యక్షమయ్యారు. మళ్లీ పాత కథను వివరించారు. సునీత, సీబీఐ ఒక లక్ష్యంతోనే వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. సునీత, సీబీఐ ఒక్కటేనని సునీత చంద్రబాబుతో చేతులు కలిపారని ఆరోపించారు. ఏడాది వరకు ఒకలా ఉన్నా, ఒక్కసారిగా సునీత వెర్షన్ మారిందని ఆరోపించారు.
పాత అధికారి చేసిన విచారణనే కొత్త బృందం ఫాలో అవుతోంది.. మేం చెప్పినా అంశాలను పరిశీలించడం లేదు.. వివేకా హత్య కేసు విషయాన్ని ముందు పోలీసులకు చెప్పిందే నేను.. ఘటనాస్థలికి తొందరగా రావాలని పోలీసులకు 3 సార్లు ఫోన్ చేశానని చెప్పుకొచ్చారు. విచారణలో కీలక విషయాలను సీబీఐ వదిలేసింది.. సిల్లీ విషయాలను సీరియస్‌గా తీసుకుంటోంది.. భాస్కర్‌రెడ్డిని ఊహించని విధంగా అరెస్ట్ చేశారు.. మాట్లాడడానికి మాటలు రావడం లేదు.. ధైర్యం కోల్పోకుండా నిజాయితీని నిరూపించుకుంటామన్నారు.
ఇదే సమయంలో అవినాష్ రెడ్డి తను గతంలో చెప్పిన పాత కథకే ఫిక్స అయ్యారు. వివేకా . మహ్మద్ అక్బర్‌గా 2010లో వివేకా పేరు మార్చుకున్నారు.. వివేకాకు షెహన్షా అనే కుమారుడు ఉన్నాడు..రెండో భార్యకు ఆస్తి రాసివ్వాలని వివేకా అనుకున్నారు. ఈ క్రమంలోనే హత్య జరిగిదన్నారు. అయితే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి తరపు లాయర్ మాత్రం.. హైకోర్టులో సునీల్ యాదవ్ తల్లిని లైంగికంగా వేధించడం వల్లనే హత్య చేశారని హైకోర్టుకు తెలిపారు. ఇలా తండ్రీ కొడుకులు చెరో కథను చెబుతూండటంతో వ్యవహారం సింక్ కావడం లేదు. సీబీఐ అధికారులకు మరింత అనుమానం వచ్చేలా వీరి తీరు ఉంది.