అజార్ కు ముచ్చటగా మూడోపెళ్లి ?!

భారత క్రికెట్ లో 99 టెస్ట్ మ్యాచ్ లు, 334 వన్ డే మ్యాచ్ లు ఆడిన మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ ఈమధ్యనే మూడోపెళ్లి చేసుకున్నారంటూ ఆన్ లైన్ మీడియాలో వార్తలొస్తున్నాయి. 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో చిక్కుకుని లైఫ్ బ్యాన్ కి గురైన ఈ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పర్సనల్ లైఫ్ లో ఇప్పుడు మరో మలుపు చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన షానన్ మారీ తల్వార్ ని పెళ్ళిచేసుకున్నట్లు కొంతమంది వద్ద అజార్ స్వయంగా చెప్పినట్లు తెలుస్తోంది. నిన్నమొన్నటి దాకా గర్ల్ ఫ్రెండ్ గానే ఉన్న షానన్ ఇప్పుడు అజార్ కు భార్యగా మారిపోయిందని అంటున్నారు.

అజార్ – షానన్ మొదటిసారిగా ఫ్రాన్స్ లో రెండేళ్ల క్రిందట కలిసి కనిపించారు. ఆ తర్వాత ఢిల్లీలో ఐపీటిఎల్ టెన్నిస్ మ్యాచ్ సందర్భంగా కూడా జంటగా కనిపించారు. అప్పుడే రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. అయితే అప్పట్లో షానన్ ని పలకరిస్తే, అజార్ తనకు ఫ్రెండ్ మాత్రమే అని చెప్పింది. కాగా, ఈమధ్య అజార్ , షానన్ కలిసి ఒకరింటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటివారితో, షానన్ తన భార్య అని చెప్పడంతో అజార్ మూడోపెళ్ళి చేసుకున్నాడన్న వార్త పొక్కింది. ఆసమయంలో షానన్ బురఖా ధరించి ఉన్నదట. షానన్ మారీ తల్వార్ ఫ్యాషన్ డిజైనర్ తో పాటుగా యోగా శిక్షకురాలు. ఈమె అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కు చెందిన వనిత అయినప్పటికీ కొన్నేళ్లుగా ఢిల్లీలో ఉంటున్నారు.

అజారుద్దీన్ ఇంతకు ముందే రెండుసార్లు పెళ్ళి చేసుకున్నాడు. మొదటి భార్య నౌరీన్ . ఆమెతో 9ఏళ్లు కాపురం చేశాడు. వీరికి ఇద్దరు మొగపిల్లలు- అసాద్, ఆయాజుద్దీన్. ఆ తర్వాత 1996లో సంగీతా బిజ్లానీతో పెళ్ళయింది. 14ఏళ్లపాటు కాపురంచేశాక, 2010లో విడిపోయారు. అజార్ ఇద్దరి కొడుకుల్లో ఒకడైన అయాజుద్దీన్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ సంఘటన అజార్ ను మానసికంగా క్రుంగదీసింది. కాగా, ఇప్పుడు 52ఏళ్ల వయసులో అజార్ మరోసారి పెళ్ళిచేసుకున్నాడన్న వార్తలందుతున్నాయి.

అజార్ జీవిత చరిత్రను బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నారు. అందులో ఎమ్రాన్ హష్మి ప్రధానపాత్ర పోషిస్తుండగా, ప్రాచి దేశాయ్, నర్గిస్ ఫక్రీ ఇద్దరు భార్యల పాత్రలను పోషిస్తున్నారు. ప్రాచి దేశాయ్ మొదటి భార్య నౌరీన్ గానూ, నర్గీస్ ఫక్రీ రెండవ భార్య సంగీతా బిజ్లానీగానూ నటిస్తున్నారు. అయితే మరి ఇప్పుడు ఈ మూడో భార్య కథను కూడా ఇందులో యాడ్ చేస్తారో లేదో చూడాలి. టోనీ డిసౌజా దర్శకత్వంలో తయారవుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది మే 13న రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

మొత్తానికి అటు అజార్ పర్సనల్ లైఫ్, ఇటు క్రికెట్ కెరీర్ లో అనేక మలుపులతో సాగిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మూడో పెళ్ళి వార్త ఆన్ లైన్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ పెళ్ళికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సిఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నిమ్మగడ్డను కలిసిన సీఎస్..! రివర్స్ వాదన..?

స్థానిక ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం చెప్పాలని.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. పార్టీ పరంగా తన అభిప్రాయం చెప్పడానికి నిరాకరించిన వైసీపీ... అధికారికంగా మాత్రం సీఎస్...

రాజధాని రైతులకు బేడీలు వేసిన పోలీసులపై వేటు..!

ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి అమరావతికి భూములిచ్చిన ఎస్సీ, ఎస్టీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి.. నిబంధనలకు విరుద్ధంగా బేడీలు వేసి.. జైలుకు తరలించిన ఘటనలో ఆరుగురు కానిస్టేబుళ్లను గుంటూరు ఎస్పీ విశాల్...

వైసీపీ వైపు సీపీఎం.. ఎన్నికల వైపు మిగతా పార్టీలు..!

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పార్టీల అభిప్రాయాలు సేకరించారు. అధికార పార్టీ వైసీపీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. హాజరైన పార్టీల్లో ఒక్క...

రూ.2 కోట్లు డిమాండ్ చేసిన హీరోయిన్‌

క‌రోనా చిత్ర‌సీమ‌ని పూర్తిగా సంక్షోభంలో నెట్టేసింది. సినిమా రంగం కోలుకోవ‌డానికి చాలా కాలం ప‌డుతుంద‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌. నిర్మాత‌ల‌కు కాస్త ఉత్సాహాన్ని, ఊపిరిని ఇవ్వాలంటే తార‌లు పారితోషికం త‌గ్గించుకోవాల్సిందే అంటూ స‌ల‌హా...

HOT NEWS

[X] Close
[X] Close