బాహుబలికి సంబంధించిన మరో సంచలన వార్త ఇది. ఒక విధంగా… బాహుబలి 2 గురించి బయటకు వచ్చిన వార్తల్లో ఇదే హైలెట్ న్యూస్ అయ్యింటుంది. బాహుబలి కన్‌క్లూజన్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాల్న తెరకెక్కిస్తున్నారు. 2017 వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. అయితే ఆ క్లైమాక్స్‌కి నాలుగు వర్షన్లు తీయబోతున్నార్ట. అందులో బెటర్ వర్షన్‌ని… బిగ్ స్ర్కీన్‌పై చూడొచ్చట. మరి మిగిలిన వెర్షన్లను ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం రకరకాల క్లైమాక్సులను అనుకొన్నార్ట. చివరికి నాలుగు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలుస్తోంది. ఆ నాలుగు వెర్షన్లనూ తీసి.. చివరికి ఏది బెటర్ అనుకొంటే ఆ వెర్షన్‌ని ఫైనల్‌గా ఉంచుతారన్నమాట.
సినిమా విడుదలైన రెండు మూడు వారాలకు మిగిలిన వెర్షన్లనూ కలుపుతారన్నమాట. అలా వసూళ్లు ఇంకాస్త పెంచుకోవొచ్చన్నది చిత్రబృందం నిర్ణయం కావొచ్చు. నాలుగు వెర్షన్లు తీస్తే.. బడ్జెట్ తడిసి మోపెడు అవుతుంది కదా, అన్న డౌటు రావొచ్చు. అయితే.. విజువల్‌గా పెద్ద తేడా ఉండదు. సెట్లు మారవు. డైలాగ్ పరంగా, సన్నివేశం పరంగా మాత్రమే సీను సీనుకీ తేడా ఉంటుందన్నమాట. అందుకే ఈ ఖర్చు పెద్ద లెక్కలోనికి రాదన్నమాట. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి విడుదల చేస్తారు. ఒక్కో భాషకూ ఒక్కో క్లైమాక్స్‌ని సెట్ చేసినా చేయొచ్చు. అంతిమ నిర్ణయం మాత్రం రాజమౌళిదే.