త్వరలో బాహుబలి ఇంటర్నేషనల్ వెర్షన్ విడుదల

హైదరాబాద్: దేశ చలనచిత్ర చరిత్రలో కనీవినీ ఎరగనివిధంగా రికార్డులు సృష్టిస్తున్న బాహుబలి త్వరలో అంతర్జాతీయంగాకూడా సినీ అభిమానులను అలరించబోతోంది. ఈ చిత్ర ఇంటర్నేషనల్ వెర్షన్ త్వరలో విడుదల కాబోతోంది. ఈ వెర్షన్‌కు, ఇండియాలో విడుదలైన బాహుబలికి చాలా వ్యత్యాసముంటుంది. ఆంగ్ల చిత్రాల అభిమానుల అభిరుచికి అనుగుణంగా చిత్రాన్ని ఎడిట్ చేస్తారు. దీనికోసం ఇప్పటికే హాలీవుడ్‌కు చెందిన ప్రఖ్యాత ఎడిటర్ విన్సెంట్ తబేల్లోన్‌ను అర్కా ఫిలిమ్స్‌వారు తీసుకున్నారు. విన్సెంట్ ఇంతకుముందు ఇన్‌క్రెడిబుల్ హంక్, క్లాష్ ఆఫ్ టైటాన్స్, టేకెన్ 2, తాజాగా వచ్చిన నౌ యు సీ మి చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు.

మరోవైపు బాహుబలి రికార్డులపర్వం కొనసాగుతోంది. నైజాం ఏరియాలో ఆరురోజులకే రు.20 కోట్లు వసూలుచేసింది. మగధీర, అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత ఇంత మొత్తాన్ని వసూలుచేసిన చిత్రం బాహబలే. అయితే ఆ మొత్తాన్ని అతి తక్కువ కాలంలోనే వసూలుచేసి రికార్డ్ సృష్టించింది. ఈ వారాంతానికి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావటం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైడ్రా.. అస్త్రసన్యాసమా?

హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల అంతు తేల్చేందుకు తీసుకొచ్చిన హైడ్రా సంచలనం రేపింది. ఎప్పుడు.. ఎక్కడ.. ఏ ఆక్రమణలను నేలమట్టం చేస్తుందోనని అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించింది. ఫిర్యాదులు రావడమే ఆలస్యం డాక్యుమెంట్ల...

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిచ్చిన రేవంత్ రెడ్డి !

జర్నలిస్టులు సుదీర్ఘంగా చేస్తున్న పోరాటం ఫలించింది . జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ కింద గతంలో కేటాయించిన భూమిని ఇప్పుడు రేవంత్ రెడ్డి హ్యాండోవర్ చేశారు. ఈ భూమికి ఒక్కో జర్నలిస్టు...

కూల్చివేతలపై హైడ్రా కీలక నిర్ణయం!

ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా వరుసగా కొరడా ఝులిపిస్తోంది. ఓ వైపు హైడ్రా పనితీరుపై ప్రశంసల జల్లు కురుస్తున్నా..మరోవైపు ఉన్నపళంగా భవనాలను కూల్చివేస్తుండటంపై తీవ్ర విమర్శలు...

జయభేరీది కార్ సర్వీసింగ్ సెంటర్ !

జయభేరీ మూడున్నర దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది కానీ ఇప్పటి వరకూ ఆ సంస్థపై చిన్న ఆరోపణ రాలేదు. క్లీన్ ఇమేజ్ తో వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్న సంస్థ. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close