వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి

దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు.

పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎమ్మెల్యే సూచనతో ట్రాక్టర్ డ్రైవర్ పిల్లలను ఎక్కించుకొని అటు, ఇటు తిప్పారు. ఈ క్రమంలోనే ట్రాక్టర్ అదుపు తప్పి చేపల చెరువులోకి వెళ్ళడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు చిన్నారులు గాయపడగా వారిని స్థానికులు ఏలూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా.. అందులో కొంతమంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనకు అబ్బయ్య చౌదరినే కారణమని…ఆయన ప్రచార ఆర్భాటమే పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిందని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మిక్కీలో ఇంత మాస్ ఉందా ?

మిక్కీ జే మేయర్ అంటే మెలోడీనే గుర్తుకువస్తుంది. హ్యాపీ డేస్, కొత్తబంగారులోకం, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్.. ఇలా బిగినింగ్ డేస్ లో చేసిన సినిమాలు ఆయనకి మెలోడీని ముద్రని తెచ్చిపెట్టాయి. మిక్కీ...

ఆ రెండు స్కాములపైనా విచారణ.. హింట్ ఇచ్చిన రేవంత్

బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్స్ లో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు చేసిన కాంగ్రెస్..వీటిపై త్వరలోనే విచారణకు ఆదేశించనుందా..? అంటే జరుగుతోన్న పరిణామాలను చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ...

టైమ్స్ జాబితాలో హైద‌ర‌బాదీ మ‌నం చాక్లెట్స్

బెస్ట్ చాక్లెట్స్ ఏవీ అన‌గానే స్విస్ చాక్లెట్స్ అంటారు. లేదా బెల్జియ‌మ్ చాక్లెట్స్ గుర్తుకొస్తాయి. కానీ ప్ర‌పంచంలో ది బెస్ట్ చాక్లెట్స్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప‌శ్చిమ గోదావ‌రి రైతులు పండించిన కోకోతో...

ఊరించి.. ఊరించి.. ఉసూరుమనిపించిన కేసీఆర్ !

ఇక నుంచి నా ఉగ్రరూపం చూస్తారు.. చీల్చిచెండాడుతానని అసెంబ్లీ వద్ద భీకర ప్రకటనలు చేశారు..ఈ ఒక్క డైలాగ్ ద్వారా ఇక కేసీఆర్ అసెంబ్లీకి హాజరు అవుతారని..రేవంత్ సర్కార్ కు చుక్కలు చూపిస్తానని సంకేతాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close