సింగయ్య మృతి కేసులో నమోదైన కేసులపై దర్యాప్తును నిలిపివేయడంతో పాటు వరుసగా బెయిల్స్ ఇస్తున్నందున తన తీర్పులను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరుమల నెయ్యి కల్తీ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సందర్భంగా తీర్పు ప్రకటించిన తర్వాత తాను ఇస్తున్న బెయిల్ తీర్పులను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని …ఇప్పుడు ఈ తీర్పును కూడా ట్రోల్ చేస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేస్తూ సారీ ఫర్ ది స్టేట్ అని వ్యాఖ్యానించారు.
జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బెయిల్ పిటిషన్లను కూడా విచారించాల్సి ఉంది. అయితే వాటిని వాయిదా వేశారు. వచ్చే వారం వేరే బెంచ్ ముందు వాటిని ఉంచాలన్నారు. రోస్టర్ ప్రకారం ఈ బెయిల్ పిటిషన్లన్నీ వేరే బెంచ్ ముందుకు రావాల్సి ఉన్నా.. సదరు న్యాయమూర్తి లీవ్‌లో ఉండటంతో.. జస్టిస్ శ్రీనివాసరెడ్డి బెంచ్ ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
జగన్మోహన్ రెడ్డి కారు సింగ దళితుడు సింగయ్య పడిన కేసులో.. వాదనల సందర్భంగా కుంభమేళాలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు జరిగాయని ఆయన వ్యాఖ్యానించడం కూడా మీడియాలో విస్తృతంగా ప్రచారం అయింది. సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్ కు గురయింది. గతంలో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు సరైన ఆధారాలు లేకపోయినా వ్యాఖ్యలు చేశారని కొంత మంది సోషల్ మీడియాలో గుర్తు చేసుకున్నారు. వీటన్నింటితో జస్టిస్ శ్రీనివాసరెడ్డి ఇబ్బందికి గురయ్యారు.