10రోజుల్లో తీయాల్సింది 5 రోజుల్లో పూర్తి చేశా!

బాల‌కృష్ణ క‌ల‌ల ప్రాజెక్టు `న‌ర్త‌న‌శాల‌`. ఈ సినిమాని త‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో మొద‌లెట్టి, 5 రోజుల షూటింగ్ త‌ర‌వాత ఆపేశారు. ఇప్పుడు ఆ 5 రోజుల పాటు తీసిన రెండు స‌న్నివేశాలే… 17 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రియాస్ ఈటీ ద్వారా ఈనెల 24 నుంచి ఈ స‌న్నివేశాల్ని చూడొచ్చు. ఈ `న‌ర్త‌న‌శాల `గురించి తొలిసారి బాల‌య్య స్పందించారు.

”మ‌హాభార‌తంలో న‌ర్త‌న‌శాల ప‌ర్వం నాకు వ్య‌క్తిగ‌తంగా చాలా ఇష్టం. అందులో అన్ని రసాలూ ఉంటాయి. అందుకే ఆ ప‌ర్వాన్ని ఎంచుకున్నా. ఆ సినిమా నా క‌ల‌ల చిత్రం. 2002లో మొద‌లెట్టాం. నాకింకా గుర్తు… న‌టీన‌టుల కాల్షీట్లు ప‌ది రోజుల పాటు తీసుకుని.. కేవ‌లం 5 రోజుల్లోనే అనుకున్న స‌న్నివేశాల్ని పూర్తి చేశా. నాది నాన్న‌గారి స్కూలు. న‌టీన‌టులకు గౌర‌వం ఇవ్వ‌డం నాకు తెలుసు. కొంత‌మంది అలా కాదు.. సెట్లోకి న‌టీన‌టులంతా వ‌స్తే గానీ ఫ్రేము పెట్ట‌రు. నేను అలా కాదు.. ఎవ‌రొస్తే… వాళ్ల‌కు సంబంధించిన స‌న్నివేశాల్ని తీసేసేవాడ్ని. తీసిన‌వి రెండు సీన్లే.. కానీ.. బాగుంటాయి. క‌ళ అన్న‌ది మ‌రుగున ప‌డ‌డం నాకిష్టం ఉండ‌దు. అది బ‌య‌ట‌కు తీయాల్సిందే. అందుకే `న‌ర్త‌న‌శాల‌`ని బ‌య‌ట‌కు తీసుకొచ్చాం. సౌంద‌ర్య మ‌ర‌ణంతో ఈ సినిమాని ఆపేశాను. ద్రౌప‌తి పాత్ర‌కు ప్ర‌త్యామ్నాయం నాకు దొర‌క‌లేదు. ఏమో… భ‌విష్య‌త్తులో ఈ సినిమా తీస్తానేమో” అని చెప్పుకొచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైదరాబాదీ.. కమాన్ లెట్స్ ఓట్..!

చదువుకున్న వాళ్లు ఓటు వేయరా..!? భారత దేశంలో ఎప్పుడు.. ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా.. మెట్రో సిటీలు లేని నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం ఎనభై శాతం వరకూ ఉంటుంది. వ్యవసాయదారులు.. చిన్న వ్యాపారులు.. చిరు...

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల కన్నుమూత..!

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మరో ఎమ్మెల్యే కన్నుమూశారు. నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డిపై గెలిచిన నోముల నర్సింహయ్య.. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. నోముల నర్సింహయ్య...

బీజేపీతో సంబంధం లేకుండానే పవన్ రైతు టూర్..!

నివార్ తుపాన్ విషయంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అంశం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ దుమారానికి కారణం అవుతోంది. ప్రభుత్వం ఎలాంటి సాయం ప్రకటించకపోవడం... రైతుల్లో ఆందోళన పెరిగిపోతూండటంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగుతున్నాయి....

చంద్రబాబుపై ఏం చర్యలు తీసుకోబోతున్నారు..!?

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అనర్హతా వేటు వేస్తారా..?. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తర్వాత అసెంబ్లీలో జరిగిన పరిణామాలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఆయనపై అనర్హతా వేటు...

HOT NEWS

[X] Close
[X] Close