బాల‌య్య‌కు మ‌రో ‘ముద్దుల మావ‌య్య‌’

బాల‌కృష్ణ చేసిన సిస్ట‌ర్ సెంటిమెంట్ సినిమా అంటే ట‌క్కున గుర్తొచ్చేది.. ముద్దుల మావ‌య్య‌. అందులో అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ ని ఓ రేంజ్ లో చూపించారు. ఆ సినిమాతో బాల‌య్య కుటుంబ ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌రైపోయాడు. ఆ త‌ర‌వాత‌… బాల‌య్య సిస్ట‌ర్ సెంటిమెంట్ సినిమాలేం చేయ‌లేదు. అయితే ఇప్ప‌డు గోపీచంద్ మ‌లినేనితో ఓ సినిమా చేస్తున్నాడు బాల‌య్య‌. దీన్నో పూర్తి స్థాయి యాక్ష‌న్ సినిమాగా అంద‌రూ చూస్తున్నారు. నిజానికి.. ఇందులో సిస్ట‌ర్ సెంటిమెంట్ పుష్క‌లంగా రంగ‌రించార‌ని తెలుస్తోంది. బాల‌య్య చెల్లాయిగా వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ న‌టించింది. ఇద్ద‌రి మ‌ధ్యా… బ‌ల‌మైన స‌న్నివేశాలు రాశాడ‌ట ద‌ర్శ‌కుడు. సిస్ట‌ర్ సెంటిమెంట్ పీక్స్ లో చూపించ‌బోతున్న సినిమా ఇద‌ని, యాక్ష‌న్ తో పాటుగా ఎమోష‌న్‌ని కూడా అదే స్థాయిలో చూపించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఓ అగ్ర క‌థానాయ‌కుడు ఈమ‌ధ్య సిస్ట‌ర్ సెంటిమెంట్ సినిమాలు చేసిన దాఖ‌లాలు లేవు. ఆ లోటు బాల‌య్య తీరుస్తున్నాడు. అన్న‌ట్టు… చిరంజీవి `భోళా శంక‌ర్` కూడా సిస్ట‌ర్ సెంటిమెంట్ సినిమానే. అందులో చిరు చెల్లాయిగా కీర్తి సురేష్ న‌టిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close