‘భ‌గ‌వ‌త్ కేస‌రి’ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది

నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి `భ‌గ‌వ‌త్ కేస‌రి` అనే టైటిల్ పెట్టిన‌ట్టు రెండ్రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పుడు అదే ఖ‌రారు చేశారు. ఐ డోంట్ కేర్ అనేది ఉప‌శీర్షిక‌. శ‌నివారం బాల‌య్య బ‌ర్త్ డే. ఈ సంద‌ర్భంగా ఈరోజు ఫ‌స్ట్ లుక్‌ని సైతం విడుద‌ల చేశారు. చేతిలో ఆయుధం.. తీక్ష‌ణ‌మైన చూపుల‌తో బాల‌య్య లుక్ చూడ‌గానే ఆక‌ట్టుకొంది. ఇది వ‌ర‌క‌టి సినిమాల‌కంటే.. భిన్న‌మైన టైటిల్ ఇది. కొత్త త‌ర‌హా గెట‌ప్ ఇది. చూస్తుంటే – బాల‌య్య కోసం అనిల్ రావిపూడి ఓ కొత్త క‌థ రాసుకొన్నాడ‌నిపిస్తోంది. అర్జున్ రాంపాల్ ప్ర‌తి నాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రంలో కాజ‌ల్ హీరోయిన్‌. శ్రీలీల కీల‌క పాత్ర పోషిస్తోంది. త‌మ‌న్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నాడు. ద‌స‌రాకి ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు. బాల‌య్య న‌టించే 108వ సినిమా ఇది. 109వ చిత్రానికి బాల‌య్య పుట్టిన రోజున క్లాప్ కొడతారు. బాబీ దీనికి ద‌ర్శ‌కుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒక ఆదర్శ ముఖ్యమంత్రిని ఇంత అన్యాయంగా అరెస్ట్ చేస్తారా ?!

''74 సంవత్సరాలు ఉన్న ఒక ఆదర్శ ముఖ్యమంత్రిని ఇంత అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం దుర్మార్గం'' అన్నారు సీనియర్ నటుడు మురళీ మోహన్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ పై కాస్త...

‘అన్నాయ్‌..’ ఆశ‌లు పోయినాయ్‌!

శ్రీ‌కాంత్ అడ్డాల డ్రీమ్ ప్రాజెక్ట్ `అన్నాయ్‌`. ఇద్ద‌రు స్టార్ హీరోలతో మ‌ల్టీస్టార‌ర్ సినిమాగా తీర్చిదిద్దాల‌న్న‌ది త‌న ప్ర‌య‌త్నం. క‌థ కూడా రెడీ. గీతా ఆర్ట్స్ లో ఈ క‌థ వినిపించారాయ‌న‌. కాక‌పోతే.. బ్ర‌హ్మోత్స‌వం...

అప్పుడు చెల్లాయి.. ఇప్పుడు అమ్మాయి

'వీరసింహరెడ్డి'లో సిస్టర్ ఎమోషన్ ని బలంగా నమ్మాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. సినిమాకి ప్రధాన ఆకర్షణగా వున్న పెద్ద బాలయ్య పాత్రని ఇంటర్వెల్ లోనే ముగించి చాలా పెద్ద సాహసమే చేశారు. ఈ...

మెగా 156.. ఆగని రూమర్స్

చిరంజీవి నుంచి ఒకేసారి రెండు సినిమా ప్రకటనలు వచ్చాయి. వశిష్ట దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం ఒకటి. మరొకటి మెగాడాటర్ సుస్మిత నిర్మించబోతున్న సినిమా. ఇది మెగాస్టార్ కి 156 చిత్రం....

HOT NEWS

css.php
[X] Close
[X] Close