హ‌మ్మ‌య్యా.. బాల‌య్యా స్పందించాడు

క‌రోనాపై ప్ర‌పంచం అంతా పోరాడుతోంది. లాక్ డౌన్ వ‌ల్ల‌.. ఎక్క‌డి ప‌నుల‌కు అక్క‌డ పుల్ స్టాప్ ప‌డిపోయింది. ఈ పోరాటానికి సినీ సెల‌బ్రెటీలు త‌మ వంతు స‌హ‌కారం అందిస్తున్నారు. స్టార్లంతా.. భారీ మొత్తంలో విరాళాలు ప్ర‌క‌టించారు. చిరంజీవి నుంచి శ్రీ‌కాంత్ వ‌ర‌కూ దాదాపు హీరోలంతా స్పందించారు. అయితే నంద‌మూరి బాల‌కృష్ణ నుంచి మాత్రం ఎలాంటి విరాళ ప్ర‌క‌ట‌నా రాలేదు. ఇలాంటి క్లిష్ట‌ప‌రిస్థితుల్లో బాలయ్య మౌనంగా ఉండ‌డం ప‌ట్ల ర‌క‌ర‌కాల కామెంట్లు వినిపించాయి. సోష‌ల్‌మీడియాలో అయితే సెటైర్లు వేసుకున్నారు. బాల‌య్య కోటి రూపాయ‌ల స‌హాయం ప్ర‌క‌టించాడ‌న్న త‌ప్పు వార్త‌లు కూడా చ‌క్క‌ర్లు కొట్టాయి. ఆ ర‌కంగానూ బాల‌య్య‌ని ఆడుకున్నారు.

అయితే ఎట్ట‌కేల‌కు బాల‌య్య స్పందించాడు. కోటి కాదు… దానికి పాతిక ల‌క్ష‌లు ఎక్కువే వేసి, కోటి పాతిక ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించాడు. రెండు తెలుగు రాష్ట్రాల‌కూ చెరో రూ.50 ల‌క్ష‌లు, సినీ కార్మికుల సంక్షేమం కోసం పాటు ప‌డుతున్న సిసిసి కీ మ‌రో పాతిక ల‌క్ష‌లు అంద‌జేశాడు. స్వ‌యం నిబంధ‌న‌ల‌తో ఇంట్లోనే ఉండి, ఈ విప‌త్తును ఎదుర్కోవాల‌ని, క‌రోనాని అరిక‌ట్ట‌డంలో అంద‌రూ భాగ‌స్వాములు కావాల‌ని త‌న అభిమానుల‌కు పిలుపునిచ్చాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: నిశ్శ‌బ్దం

తెలుగు360 రేటింగ్ 2/5 పొడుపు క‌థ వేయ‌డంలో కాదు. దాన్ని విప్ప‌డంలో అంత‌కంటే ఎక్కువ మ‌జా ఉంటుంది. థ్రిల్ల‌ర్ సినిమాలూ అంతే. అందులో చిక్కుముడులు కాదు. దాన్ని విప్పే విధానం ముఖ్యం. థ్రిల్ల‌ర్...

రివ్యూ: ఒరేయ్‌.. బుజ్జిగా

తెలుగు360 రేటింగ్ 2.25/5 క‌న్‌ఫ్యూజ్ డ్రామాలు భ‌లే బాగుంటాయి. దాంట్లోంచి బోలెడంత కామెడీ చేయొచ్చు. క‌థేమీ లేక‌పోయినా - ఆ గంద‌ర‌గోళంతోనే క‌థ న‌డిపేయొచ్చు. విజ‌య్ కుమార్ కొండా తీసిన `గుండె జారి...

తీరు మారకుంటే ఇతర అధికారాన్ని వినియోగిస్తాం..! ఏపీ సర్కార్‌కు హైకోర్టు హెచ్చరిక..!

హైకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ అంశంపై జరిగిన విచారణలో రూల్‌ ఆఫ్‌ లా సరిగ్గా అమలు కాకుంటే...

హిమాన్షుకు గాయం..! అంతగా చర్చించుకున్నారేంటి..?

కేటీఆర్ కుమారుడు హిమాన్షు గుర్రపుస్వారీ చేస్తూండగా కిందపడి గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కాలుకు ఓ మాదిరి గాయం అయిందని ఇతర చోట్ల స్వల్ప గాయాలయ్యాయని ప్రచారం జరిగింది. అయితే...

HOT NEWS

[X] Close
[X] Close