‘న‌ర్త‌న‌శాల‌’లో అర్జునుడిడిగో…!

నంద‌మూరి బాల‌కృష్ణ క‌ల‌ల ప్రాజెక్టు `న‌ర్త‌న‌శాల‌`. త‌న స్వీయ నిర్మాణంలోనే ఈ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. భారీ కాస్టింగ్‌, బాల‌య్య ద‌ర్శ‌క‌త్వం, పౌరాణిక గాథ‌.. ఇవ‌న్నీ ఈ సినిమాపై ఆక‌ర్ష‌ణ‌ని పెంచాయి. కొంత‌మేర షూటింగ్ జ‌రిపారు కూడా. అయితే.. ప‌రిస్థితులు అనుకూలించ‌క ఈ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ఆ నర్త‌న శాల ఎలా ఉండేదో చూసే అవ‌కాశం బాల‌య్య అభిమానుల‌కు క‌లుగుతోంది. న‌ర్త‌న శాల షూటింగ్ జ‌రుపుకున్న ఆ కొంత భాగాన్ని ఈనెల 24న విడుద‌ల చేస్తున్నారు. 17 నిమిషాల నిడివి గ‌ల కొన్ని స‌న్నివేశాల్ని చూపించ‌బోతున్నారు. ఈరోజు.. బాల‌య్య ఫ‌స్ట్ లుక్ కూడా వ‌చ్చింది.

ఇందులో బాల‌కృష్ణ అర్జున పాత్ర‌ధారి. ఆయ‌న‌కు సంబంధించిన గెట‌ప్ ఇప్పుడు రివీల్ చేశారు. పౌరాణిక పాత్ర‌లు చేయ‌డంలో నంద‌మూరి హీరోలు కొట్టిన పిండి. కాబ‌ట్టి.. లుక్ ప‌రంగా బాగానే ఉంది. కాక‌పోతే.. పాత ఛాయ‌లు క‌నిపించాయి. సినిమా ఎప్ప‌టిదో క‌దా..? `ఇది పాత సినిమానే` అనిపించేలానే వుంది లుక్‌. `న‌ర్త‌న శాల‌`లో ఏ ఎపిసోడ్ ని ఇప్పుడు చూపిస్తారో ఆస‌క్తిగా మారింది. 17 నిమిషాల నిడివి అంటే.. మ‌హా అయితే రెండు మూడు సీన్లు మాత్ర‌మే తీసి ఉంటారు. ఆ 17 నిమిషాలూ సినిమా చూసిన ఫీలింగ్ అయితే ఇవ్వ‌లేవు. ఎడిటింగ్ లో కొట్టుకుపోయిన స‌న్నివేశాల్ని మ‌ళ్లీ చూపిస్తుంటారు క‌దా. అలాంటి అనుభ‌వ‌మైతే క‌లుగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ సినిమాలో ర‌కుల్ లేదు

మోహ‌న్‌బాబు క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న చిత్రం.. సన్నాఫ్ ఇండియా. డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌కుడు. ఇళ‌య‌రాజా సంగీత అందిస్తున్నారు. ఎం.ధ‌ర్మ‌రాజు ఎం.ఏ, పుణ్య‌భూమి నాదేశం త‌ర‌హాలో సాగే క్యారెక్ట‌రైజేష‌న్ ఈ సినిమాలో క‌నిపించ‌బోతోంద‌ట‌. మ‌ళ్లీ ఆ...

రివ్యూ: అంధ‌కారం

హార‌ర్‌, థ్రిల్ల‌ర్ సినిమాల్ని చూసి.. విసుగొచ్చేసింది. అన్నీ ఒక ఫార్మెట్‌లోనే సాగుతుంటాయి. హార‌ర్ అన‌గానే... భ‌యంక‌రమైన రీ సౌండ్లు, ఓ ఇల్లు, అందులో కొన్ని పాత్ర‌లు విచిత్రంగా ప్ర‌వ‌ర్తించ‌డం.. ఇవే క‌నిపిస్తాయి. థ్రిల్ల‌ర్లూ...

పెంచుకుంటూ పోయే ప్రక్రియలో ఈ సారి ఆస్తి పన్ను..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నులు పెంచుకుటూ పోతోంది. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ.. అవకాశం లేకపోయినా స్పేస్ చూసుకుని మరీ పెంచుకుటూ పోతోంది. పెట్రోలో నుంచి టోల్ చార్జీల వరకూ కొత్త కొత్త ఆలోచనలు...

జనసేనను ప్లాన్డ్‌గా తొక్కేస్తున్న బీజేపీ..!?

భారతీయ జనతా పార్టీ వ్యూహం .. జనసేనను ప్లాన్డ్‌గా..తొక్కేయడమేనని పెద్దగా ఆలోచించకుండా జనసైనికులకు ఆర్థం అవుతోంది. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లను బీజేపీ తెచ్చుకుంది. ఆరు శాతం ఓట్లను వైసీపీ...

HOT NEWS

[X] Close
[X] Close