గౌతమి పుత్ర శాతకర్ణి బిజినెస్.. సినీ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. సింహా, లెజెండ్ టైమ్‌లో కూడా ఇంత ఫాస్ట్ ఫాస్ట్ గా బిజినెస్ పూర్తవ్వలేదు. గౌతమి ఏమీ మాస్ సినిమాకాదు. ఓ రకంగా చెప్పాలంటే ప్రయోగాత్మక చిత్రమే. అయినా సరే.. బయ్యర్లు ఎగబడి సినిమాని కొనేయడం వింతగానే అనిపిస్తుంది. బాలయ్య సినిమా అంటే.. రిలీజ్‌కి ముందే బిజినెస్ క్లోజ్ అవ్వడం మామూలే. అయితే… మరీ ఇంత తొందరగా అయితే కాదు. గౌతమి పుత్రకు మొత్తమ్మీద కలిపి రూ.60 నుంచి రూ.70 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. ఏ ఏరియా చూసినా బాలయ్య కెరీర్లోనే హయ్యస్ట్ రేట్ పలికింది. ఈ సినిమా బిజినెస్‌తో క్రిష్ హ్యాపీ. మరి బాలయ్య మాటేంటి? ఈ సినిమాకి బాలయ్య దక్కించుకొన్న పారితోషికం ఎంత?
సింహా, లెజెండ్ సినిమాలకు బాలకృష్ణ రూ.6 నుంచి రూ.7 కోట్లలోపు పారితోషికం దక్కించుకొన్నాడు. గౌతమి పుత్ర కోసం బాలయ్య రూ.10 కోట్ల వరకూ డిమాండ్ చేసే అవకాశం ఉన్నా.. కథ నచ్చి, ఇదో ప్రయోగాత్మక చిత్రం అవుతుందని భావించి, నిర్మాతలకు రిస్క్ తగ్గించాలన్న ఉద్దేశంతో రూ.8 కోట్లకు ఒప్పుకొన్నాడట. నిజానికి ఈ సినిమా లో బాలయ్యని బిజినెస్ పార్టనర్‌గా మారుద్దామనుకొన్నాడు క్రిష్. అందుకే సహ నిర్మాతగా బాలయ్యకు అత్యంత సన్నిహితుడు కొమ్మినేనిని పెట్టారు. అయితే.. మధ్యలో ఏమనుకొన్నాడో ఏమో, పారితోషికం తీసుకోవడానికే బాలయ్య మొగ్గు చూపించాడు. దాంతో రూ.8 కోట్ల పారితోషికం ముట్టజెప్పాడు. బిజినెస్ ఈ రేంజులో జరుగుతుందని ఊహిస్తే.. బాలయ్య భాగస్వామ్యానికే ఓటేద్దుడేమో?