బివిఎస్ ర‌వికి బాల‌య్య ఛాన్స్‌?

బివిఎస్ ర‌వి ర‌చ‌యిత‌గా సుప‌రిచితుడే. కొన్ని హిట్ సినిమాల్లో తన వాటా కూడా ఉంది. అయితే దర్శ‌కుడిగా రాణించ‌లేక‌పోయాడు. వాంటెడ్‌, జ‌వాన్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఆయ‌న మ‌రోసారి మెగా ఫోన్ ప‌ట్టే సాహ‌సం చేయ‌లేక‌పోయారు. అయితే ఇప్పుడు బాల‌కృష్ణ ఆ అవ‌కాశం ఇచ్చిన‌ట్టు స‌మాచారం. బాల‌య్య కోసం బివిఎస్ ర‌వి ఓ క‌థ సిద్ధం చేశార‌ని, అది బాల‌య్య‌కూ న‌చ్చింద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ కాంబినేష‌న్ గురించిన క‌బురు బ‌య‌ట‌కు రానుంది.

బాల‌య్య ర‌వికి అవ‌కాశం ఇవ్వ‌డానికి ప్ర‌ధాన‌మైన కార‌ణం.. `అన్ స్టాప‌బుల్‌`. ఆహాలో ప్ర‌ద‌ర్శిత‌మైన ఈ టాక్ షోకు అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. ఈ షోతో… బాల‌య్య మ‌రింత మందికి చేరువ‌య్యాడు. `అన్ స్టాప‌బుల్‌`తో బాల‌య్య‌కు కొత్త త‌ర‌హా ఇమేజ్ వ‌చ్చింది. ఈ షో తెర వెనుక సూత్ర‌ధారి బివిఎస్ ర‌వి. షోని స‌మ‌ర్థ‌వంతంగా న‌డిపిన ర‌వి ప‌నితీరు బాల‌య్య‌కు న‌చ్చింద‌ని, అందుకే ఈ ఆఫ‌ర్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. ర‌వి సామ‌ర్థ్యం, త‌న ప‌రిచ‌యాల‌తో… హీరోల‌కు క‌థ‌లు చెప్పి ఒప్పించ‌డం వ‌ర‌కూ ఓకే. ఇది వ‌ర‌కు కూడా ఇలానే అవ‌కాశాలు అందుకొన్నాడు. కానీ… ఆ అవ‌కాశాల్ని నిల‌బెట్టుకోవ‌డంలో మాత్రం ర‌వి త‌డ‌బ‌డుతున్నాడు. మ‌రి ఈసారి ఏం చేస్తాడో? బాల‌య్య ఛాన్స్ ఇచ్చినా ఇప్ప‌టికిప్పుడు ఈ ప్రాజెక్ట్ సెట్ కి వెళ్ల‌దు. ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేనితో ఓసినిమా చేస్తున్నాడు బాల‌య్య‌. ఆ త‌ర‌వాత‌.. అనిల్ రావిపూడి సినిమా ఉంది. బోయ‌పాటి శ్రీ‌ను కూడా లైన్‌లో ఉన్నాడు. ఇవ‌న్నీ పూర్త‌య్యాకే ర‌వితో ప్రాజెక్టు ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close