రీషూట్లూ, రీ రైట్లూ… బాల‌య్య‌లో ఏమిటీ మార్పు..?!

బాల‌కృష్ణ ద‌గ్గ‌ర మంచిదో చెడ్డ‌దో ఓ అల‌వాటు ఉంది. ఓ ద‌ర్శ‌కుడ్ని న‌మ్మితే గుడ్డిగా ఫాలో అయిపోతాడంతే. ‘ఇదెందుకు… అదెందుకు’ అనే ఆరాలు ఉండ‌వు. దాన్ని ఆస‌రాగా తీసుకొని కొంత‌మంది ద‌ర్శ‌కులు గొప్ప సినిమాలు తీశారు. ఇంకొంత‌మంది అదే అలుసు అనుకొని డిజాస్ట‌ర్లు క‌ట్ట‌బెట్టారు. ‘బాల‌య్య‌లా ఫ్రీ హ్యాండ్ ఎవ‌రూ ఇవ్వ‌రు’ అనేది ద‌ర్శ‌కుల మాట‌.

అయితే ఈ విష‌యంలో మాత్రం బాల‌య్య‌లో స్ప‌ష్ట‌మైన  మార్పు క‌నిపిస్తోంది. సినిమా మ‌ధ్య‌మ‌ధ్య‌లో చూసుకోవ‌డం, మార్పులు చేర్పులు చెప్ప‌డం, అవ‌స‌ర‌మైతే రీషూట్లు చేయ‌డం, స్క్రిప్టు మార్చ‌డం.. ఇవ‌న్నీ బాల‌య్య‌లో కొత్త‌గా క‌నిపిస్తున్న ల‌క్ష‌ణాలు. బాల‌కృష్ణ – బాబీ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. స్క్రిప్టు లాక్ అయ్యాక కూడా మార్పులు చోటు చేసుకొంటున్నాయి.

Also Read : రాజ‌స్థాన్ వెళ్తున్న బాల‌య్య‌

ఇటీవ‌ల ర‌ష్ చూసుకొన్న బాల‌య్య ఇందులోని ఓ ట్రాక్ మొత్తాన్ని తీసేసి, కొత్త‌గా రీ షూట్ చేయాల‌ని ఆదేశించాడ‌ట‌. స్టార్ హీరోల సినిమాల‌కు ఇది స‌హ‌జంగా జ‌రిగే సంగ‌తే. కానీ బాల‌య్య సినిమాల‌కు మాత్రం ఇలాంటి ప‌రిణామం ఇదే తొలిసారి. బాలకృష్ణ ప్రాజెక్టుల విష‌యంలో కుమార్తె తేజస్విని ఈమ‌ధ్య జోక్యం చేసుకొంటున్నారు. బాల‌య్య ఏ క‌థ వినాల‌న్నా ముందు తేజస్వినికే చెప్పాలి. త‌న‌కు న‌చ్చితేనే ఆ క‌థ బాల‌య్య వ‌ర‌కూ వెళ్తుంది. బాల‌య్య సినిమా రీషూట్లు, రీ రైట్ల వెనుక ఉన్న బ‌ల‌మైన కార‌ణం కూడా తేజస్వినినే అని బ‌య‌ట టాక్. బాల‌య్య విగ్గు, కాస్ట్యూమ్స్, స్టైలింగ్ ఇలాంటి విష‌యాల‌న్నీ తేజస్వినినే చూసుకొంటోంద‌ట‌. ‘భ‌గ‌వంత్ కేస‌రి’లో బాల‌య్య లుక్ బాగుంది. కాస్ట్యూమ్స్ కూడా న‌ప్పాయి. బాబీ సినిమాకు సంబంధించి ఓ లీక్డ్ ఫొటో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అందులో బాల‌య్య గెట‌ప్ ఆక‌ట్టుకొంది. బాల‌య్య కొత్త‌గా, మ‌రింత అందంగా క‌నిపిస్తున్నాడ‌న్న‌ది ఫ్యాన్స్ మాట‌. ఆ కితాబుల‌న్నీ బ్రాహ్మ‌ణికే ద‌క్కుతాయ‌ని స‌న్నిహితుల మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close