భ‌గ‌వంత్ కేస‌రి.. ‘బాల‌య్య 2.ఓ’

‘అఖండ’ త‌ర‌వాత బాల‌కృష్ణ ఇమేజ్ కాస్త మారింది. త‌న వ‌య‌సుకి త‌గిన పాత్ర‌ల్ని ఎంచుకొంటూ, త‌న అభిమానుల్ని సంతృప్తి ప‌ర‌చుకొంటూ ముందుకు వెళ్తున్నారు. ఆయ‌న చేతిలో ఉన్న సినిమా `భ‌గ‌వంత్ కేస‌రి`. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. అనిల్ రావిపూడి ఇప్ప‌టి వ‌ర‌కూ… కామెడీ, ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమాలే చేశాడు. అయితే ఈసారి బాల‌య్య కోసం ఓ సీరియ‌స్ స‌బ్జెక్ట్ కి ఎంచుకొన్నాడు. ఓ తండ్రి ప్ర‌తీకారం నేప‌థ్యంలో ఈ సినిమా సాగ‌బోతోంది. బాల‌య్య గెట‌ప్‌, త‌న పాత్ర చిత్ర‌ణ‌, డైలాగ్ డెలివ‌రీ.. ఇవ‌న్నీ ఈ సినిమాలో కొత్త‌గా ఉండ‌బోతున్నాయి. ఇటీవ‌ల చిత్ర‌బృందం ర‌షెష్ చూసుకొంది. సినిమా వ‌చ్చిన విధానంపై పూర్తి సంతృప్తితో ఉంది. ఓర‌కంగా ఇది బాల‌య్య‌కే కాదు, అనిల్ రావిపూడికీ కొత్త త‌ర‌హా ప్ర‌య‌త్న‌మే. బాల‌య్య ఇమేజ్‌తో పాటుగా.. రావిపూడి ఇమేజ్ కూడా ఈ సినిమాతో పూర్తిగా మారే అవ‌కాశాలు ఉన్నాయి. ఈత‌రం ద‌ర్శ‌కుల్లో బాల‌య్య‌ని అభిమానుల‌కు న‌చ్చేలా చూపిస్తాడ‌న్న పేరు బోయ‌పాటి శ్రీ‌ను సొంత‌మైంది. అయితే.. ఈ లిస్టులో ఇక ముందు అనిల్ రావిపూడి పేరు కూడా చేర‌బోతోంద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

సెట్లో కూడా బాల‌య్య కొత్త‌గా క‌నిపిస్తున్నాడ‌ని, త‌న ప్ర‌వ‌ర్త‌న కొత్త‌గా ఉంద‌ని టీమ్ చెబుతోంది. సాధార‌ణంగా బాల‌య్య సెట్లో ఉంటే, అంద‌రూ అటెన్ష‌న్‌లో ఉండిపోతారు. బాల‌య్య జోకులు వేసి, న‌వ్వించ‌డం తప్ప‌, మిగిలిన వాళ్లు అంత‌గా చ‌నువు తీసుకోరు. కానీ.. భ‌గ‌వంత్ కేస‌రి సెట్లో ప‌రిస్థితి భిన్నంగా ఉంద‌ని తెలుస్తోంది. బాల‌య్య ప్ర‌తి ఒక్క‌రినీ పేరు, పేరునా ప‌ల‌క‌రిస్తుర‌న్నాడ‌ని, ముఖ్యంగా శ్రీ‌లీల‌తో మ‌రింత స్నేహంగా, ప్రేమ‌గా ఉంటున్నాడ‌ని తెలుస్తోంది. సెట్లోనే కాదు.. బ‌య‌ట కూడా `అమ్మా.. అమ్మా` అంటూ క‌న్న కూతురిలానే చూసుకొంటున్నాడ‌ట‌. బాల‌య్య ఆప్యాయ‌త‌కు శ్రీ‌లీల కూడా పొంగిపోతోంద‌ట‌. ఈమ‌ధ్య మ‌న స్టార్ హీరోలు వ‌య‌సుకు మించిన పాత్ర‌లు చేయ‌డం లేద‌న్న ఓ విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో బాల‌య్య మాత్రం హుందాగా క‌నిపిస్తాడ‌ని, త‌న న‌ట‌న‌, ఆహార్యం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌ని ఇప్ప‌టికే ర‌షెష్ చూసిన‌వాళ్లు చెబుతున్న మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆహా ఒరిజినల్ సిరీస్ ‘పాపం పసివాడు’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన డైరెక్టర్ సందీప్ రాజ్ … సెప్టెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్

పాపులర్ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆహా నుంచి ‘పాపం పసివాడు’*అనే కామెడీ వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకులను పలకరించుంది. ఈ ఒరిజినల్‌ను *వీకెండ్...

టీడీపీ, జనసేన క్యాడర్ సమన్వయ బాధ్యతలు తీసుకున్న నాగబాబు

టీడీపీ, జనసేన పొత్తు ఖరారు కావడంతో ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా కలిసి పోటీ చేసేందుకు ఓట్ల బదిలీ సాఫీగా జరిగేందుకు..క్యాడర్ మధ్య సమన్వయం సాధించే బాధ్యతను మెగా బ్రదర్ నాగబాబు తీసుకున్నారు....

లండన్‌లో జగన్ రెడ్డి ఫ్యామిలీకీ ఏపీ ప్రజల ఖర్చుతోనే సెక్యూరిటీ

ఏపీ ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త చట్టం తీసుకువస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టింది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన...

లింగుస్వామికి ఓ హీరో కావాలి

‘పందెంకోడి’, ‘ఆవారా’ వంటి చిత్రాలతో తెలుగువారికి సుపరిచితులైన దర్శకుడు లింగుస్వామి. ఇటీవల రామ్‌తో ‘ది వారియర్‌’ తీశాడు. ఈ సినిమా పరాజయం పాలైయింది. ఇప్పుడు మళ్ళీ ఓ తెలుగు హీరోతోనే సినిమా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close