నందమూరి బాలకృష్ణ 101వ సినిమాలో కొత్త ట్విస్ట్. కృష్ణవంశీతో చేయబోతున్న `రైతు` సినిమాకి స్పీడ్ బ్రేకర్ పడినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి బాలయ్య వందో సినిమా `రైతు` అనుకొన్నారు. అయితే.. సడన్ గా గౌతమి పుత్ర శాతకర్ణి ట్రాక్ ఎక్కేసింది. రైతు కథని అమితంగా ఇష్టపడిన బాలయ్య.. ఆ సినిమాని ఎలాగైనా సరే, కృష్ణవంశీతో చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇందులో ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం అమితాబ్ బచ్చన్ ని సంప్రదించడం, ఆయన ఓకే అనేయడం జరిగిపోయాయి. అయితే ఈలోగా ఏమైందో.. ఈ సినిమాని పక్కన పెట్టాలని బాలయ్య భావిస్తున్నాడని తెలుస్తోంది. కృష్ఱవంశీతో సరిగ్గా ట్యూనింగ్ కుదరకపోవడం వల్లే ఈ సినిమాని బాలకృష్ణ వద్దనుకొంటున్నట్టు టాక్.
రైతు కథ కృష్ణవంశీ చేతుల్లోకి వెళ్లాక రకరకాల మలుపులు తిరుగుతోందని, ఒక రోజు ఒకలా.. మరో రోజు మరోలా కథ మార్చేస్తున్నారని, ఈ విషయంలో కృష్ణవంశీకి బాలయ్యకు మధ్య కమ్యునికేషన్ గ్యాప్ వచ్చిందని తెలుస్తోంది. అందుకే… రైతు సినిమాని మరోసారి హోల్ట్లో పెట్టినట్టు తెలుస్తోంది. 101వ సినిమాకి కథ, దర్శకుడు కోసం బాలయ్య ఆల్రెడీ వేట మొదలెట్టేశారని సమాచారం. రైతు కథ కృష్ణవంశీది కాదు. మరో రచయితది. కథపై అంత నమ్మకం ఉంటే.. ఈ సినిమాకి మరో దర్శకుడ్ని ఎంచుకొనే అవకాశం ఉంది. కానీ ఏమైందో బాలయ్య మాత్రం ఈ ప్రాజెక్టునే వద్దనుకొంటున్నాడని తెలుస్తోంది. సో.. కృష్ణవంశీకి మళ్లీ నిరాశే అన్నమాట.