పేకాడితే తప్పేంటి ..? ఎదురుదాడే మంత్రుల కవరింగ్..!

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులు తాము ఏం చేసినా కరెక్టేనని అనుకుంటున్నట్లుగా ఉన్నారు. ఏ అంశంపైనైనా విమర్శిస్తే తప్పేంటి అని ఎదురు దాడి చేస్తున్నారు. ఇతర విషయాల సంగతేమో కానీ.. పేకాట విషయంలోనూ అదే వాదన వినిపిస్తూ ఉండటం ఆశ్చర్య కరంగా మారింది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేకాట, కాసినోల్లో సమయం గడిపేస్తున్నారని… ప్రజలను పట్టించుకోవడం లేదని… ఒంగోలు పర్యటనల్లో నారా లోకేష్ విమర్శించారు. వెంటనే బాలినేని రంగంలోకి వచ్చారు. తాను మిత్రులతో సరదాగా మిత్రులతో పేకాట ఆడతానని.. పేకాట ఆడితే తప్పేంటని ప్రశ్నించారు. అంతే కాదు.. కాసినోలకూ వెళ్తానన్నారు. అందులోనూ తప్పేంటని ప్రశ్నించారు. మంత్రి బాలినేని రియాక్షన్ చూసి.. గతంలో కొడాలి నాని అన్న కామెంట్లు అందరికీ గుర్తొచ్చాయి.

గుడివాడలో పెద్ద ఎత్తున పేకాట క్లబ్‌లు ఉన్నాయి. వాటిపై పోలీసులు రెయిడ్ చేసి.. ఓ సందర్భంలో పెద్ద ఎత్తున పట్టుకున్నారు. అందులో… కొడాలి నాని దగ్గరి బంధువులు కూడా ఉన్నారు. ఈ రెయిడ్స్ జరిగిన వెంటనే.. కొడాలి నాని హుటాహుటిన ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడి.. పేకాట ఆడితే తప్పేంటని ప్రశ్నించారు. పట్టుకుంటే ఉరి వేయరని.. రూ. యాభై ఫైన్ కట్టి వచ్చి మళ్లీ ఆడుకుంటారని స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో వైసీపీ ప్రభుత్వం.. మంత్రుల వ్యవహారశైలిపై అందరికీ ఓ క్లారిటీ వచ్చినట్లయింది. ఓ వైపు.. పేకాటను మట్టు పెట్టేస్తాం.. ఆన్ లైన్‌లోనూ ఆడకుండా చేస్తామని నిషేధం విధించిన ప్రభుత్వంలోని పెద్దలు.. ఇలా ఆడతామని బహిరంగంగా ప్రకటించడం చర్చనీయాంశం అయింది.

అప్పుడు కొడాలి నాని.. ఇప్పుడు బాలినేని పేకాట ఆడితే.. ఆడిస్తే తప్పేంటన్నట్లుగా మాట్లాడటంతో అదే ఎదురుదాడి అని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మంత్రుల గడుసుదనం తెలియక.. కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి గుమ్మనూరు జయరాం.. తన గ్రామంలో బయటపడిన పేకాట క్లబ్‌ల వ్యవహారంలో తనకేం సంబంధం లేదని బుకాయించే ప్రయత్నం చేశారు. ఆడితే.. ఆడిస్తే తప్పేంటని కొడాలి నానిలా ఎదురుదాడి చేయకపోవడంతో ఆయన తప్పు చేసినట్లుగా భావించే పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఏపీ మంత్రులు కొత్త స్టాండర్డ్స్ మాత్రం నమోదు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close