పార్టీ మార్పుపై బాలినేని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి… వైసీపీ అధికారంలో ఉన్నా, లేకున్నా… పార్టీలో రెబ‌ల్. పార్టీని డైరెక్టుగా కామెంట్ చేయ‌ట‌మే కాదు, పార్టీ త‌ప్పుల‌ను ఓపెన్ గా చెప్తుంటారు.

ఒంగోలులో ఓట‌మి త‌ర్వాత బాలినేని పార్టీ మారుతార‌ని, ఆయ‌న జ‌న‌సేన‌లోకి వెళ్తున్నార‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది. వైసీపీతో ఎన్నిక‌ల‌కు ముందు నుండే అంటీముట్ట‌న‌ట్లుగా ఉంటున్న బాలినేని, ఇప్పుడు పార్టీ మార్పు ఖాయం అన్న‌ది ఆ ప్ర‌చార సారాంశం.

అయితే, పార్టీ మార్పుపై త‌న‌దైన శైలీలో స్పందించారు బాలినేని. తాను పార్టీ మారాల‌ని మా పార్టీ వారే కోరుకుంటున్న‌ట్లున్నారు… పార్టీ న‌న్ను ప‌ట్టించుకోవ‌టం లేద‌ని కామెంట్ చేశారు. ఎన్నిక‌లు అయిపోయిన నాటి నుండి నేను పార్టీకి దూరంగా ఉంటున్నాన‌ని, ఈవీఎంల‌పై నేను చేస్తున్న పోరాటాన్ని పార్టీ ప‌ట్టించుకుంట‌లేదని బాలినేని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

పార్టీ ప‌ట్టించుకున్నా, ప‌ట్టించుకోకున్నా త‌న పోరాటం ఆగ‌ద‌న్న బాలినేని… నాకు ప్ర‌జ‌లున్నారు. ప్ర‌జ‌ల అండ‌గా పోరాడుతాన‌ని ప్ర‌క‌టించారు. నేను పార్టీ మారే ఆలోచ‌న లేకున్నా, మా పార్టీ నేత‌ల‌కు ఉన్న‌ట్లుంద‌ని కామెంట్ చేయ‌టం కొస‌మెరుపు.

దీంతో, ఇప్పుడు బాలినేనికి పొగ‌పెడుతున్న‌దెవ‌రు? బాలినేనికి- వైవీ సుబ్బారెడ్డికి ఉన్న ఆధిప‌త్య పోరు తారాస్థాయికి చేరిందా…? జ‌గ‌న్ బాలినేనిని పూర్తిగా ప‌క్క‌కు పెట్టారా? వంటి ప్ర‌శ్న‌లతో వైసీపీ శ్రేణులు గంద‌ర‌గోళంలో ప‌డిపోయాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీకి బిగ్ షాక్… బాలినేని రాజీనామా!

ఎన్నో రోజులుగా ఉన్న అసంతృప్తి... జ‌గ‌న్ ఎన్ని రాయ‌బారాలు పంపినా బాలినేని ఆగ‌లేదు. ముక్కుసూటిగా మాట్లాడుతార‌న్న పేరున్న మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నిక‌లకు ముందు...

బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను కూల్చివేయండి… హైకోర్టు కీల‌క ఆదేశాలు

బీఆర్ఎస్ పార్టీ అనుమ‌తి లేకుండా పార్టీ ఆఫీసును నిర్మించింద‌ని దాఖ‌లైన పిటిష‌న్ పై హైకోర్టు సంచ‌ల‌న తీర్పునిచ్చింది. 15రోజుల్లో పార్టీ ఆఫీసును కూల్చివేయాల‌ని స్ప‌ష్టం చేసింది. న‌ల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ...

కొడాలి నాని.. వల్లభనేని వంశీ సైలెన్స్ వెనక కారణం ఇదేనా ?

కొడాలి నాని.. వల్లభనేని వంశీ...ఫైర్ బ్రాండ్ నేతలు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడూ ప్రత్యర్ధి పార్టీల నేతలపై చెలరేగిపోయిన వీరిద్దరూ .. కూటమి అధికారంలోకి వచ్చాక పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కూటమి సర్కార్ అధికారంలోకి...

కాంగ్రెస్ విన్నింగ్ ఫార్మూలా- హ‌ర్యానాలోనూ ఇక్క‌డి మేనిఫెస్టోనే!

వ‌రుస‌గా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రాలేక‌పోయిన కాంగ్రెస్ పార్టీ... అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలుస్తూ, ఒక్కో రాష్ట్రంలో పాగా వేయాల‌న్న ఉద్దేశంతో ఉంది. అందుకే ఒక రాష్ట్రంలో స‌క్సెస్ అయిన ఫార్మూలాను ఇంకో రాష్ట్రంలోనూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close