వెంకటేష్ -త్రివిక్రమ్ సినిమాకు ‘ఆదర్శ కుటుంబం’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఈ సినిమా కోసం ‘బంధుమిత్రుల అభినందనలతో’ అనే టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. టైటిల్ లో ఫ్యామిలీ వైబ్ ఉంది కాబట్టి, కచ్చితంగా ఇది త్రివిక్రమ్ టైటిలే అనుకొన్నారు. అయితే సడన్ గా ‘ఆదర్శకుటుంబం’ అనే టైటిల్ తెరపైకు వచ్చింది. ఇప్పుడు ఓ మీడియం రేంజ్ సినిమాకు ‘బంధుమిత్రుల అభినందనలతో’ అనే టైటిల్ ఖాయం చేశారు.
సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ‘బలగం’కి సహాయకుడిగా పనిచేసిన ఓ కుర్రాడు దర్శకత్వం వహించబోతున్నాడు. MAD ఫేమ్ రామ్ నితిన్ ఈ చిత్రంలో హీరో. బలగం చావు చుట్టూ తిరిగే స్టోరీ. ఇది పెళ్లి కథ. తెలంగాణ నేపథ్యంలో సాగుతుంది. తెలంగాణలో పెళ్లి సంప్రదాయం, దావత్… వీటిపై తయారు చేసుకొన్న కథ ఇది. దీనికి ‘బంధుమిత్రుల అభినందనలతో’ అనే టైటిల్ యాప్ట్ గా ఉంటుందని నాగవంశీ భావించారు. అదే టైటిల్ రిజిస్టర్ కూడా చేయించారు. ఎప్పుడైతే సితార బ్యానర్లో ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారో, అప్పుడు ఇది త్రివిక్రమ్ సినిమా అనుకొన్నారు. అలా ఆ టైటిల్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.