తాలిబన్ తెలంగాణ కావాలా..? బీజేపీ కావాలా?: బండి సంజయ్

తెలంగాణలో బండి సంజయ్ పాదయాత్రను ప్రారంభించారు. చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ఆయన నడక లాంఛనంగా ప్రారంభమయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్ తమ పార్టీ ఎజెండాను నేరుగానే చెప్పారు. భాగ్యలక్ష్మీ ఆలయం నుంచి ప్రజా సంగ్రామ యాత్ర మొదలు పెడుతుంటే బీజేపీ మతతత్వ పార్టీ అంటున్నారని .. ఖచ్చితంగా బీజేపీ మతతత్వ పార్టీనేనని బండి సంజయ్ తేల్చిచెప్పారు. కచ్చితంగా బీజేపీ హిందువుల కోసమే ఉందని.. హిందూ సమాజాన్ని ధర్మాన్ని కాపాడేందుకు బీజేపీ పని చేస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రతి హిందువు గర్వంగా చెప్పుకొనే పరిస్థితి తీసుకొస్తామని భరోసా ఇచ్చారు.

భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు రాకూడదా అని మండిపడ్డారు. భాగ్యలక్ష్మి ఆలయం మాది.. పాత బస్తీ మాది… తెలంగాణ మాది…అని బండి సంజయ్ ఆవేశ పడ్డారు. ఏ బస్తీకైనా, ఏగల్లీకైనా వెళ్తామని స్పష్టం చేశారు. తాలిబన్ భావజాలం ఉన్న ఎంఐఎం పార్టీని, దానికి సహకరిస్తున్న ఎవరినైనా ఈ తెలంగాణ నుంచి తరిమితరిమి కొట్టడమే బీజేపీ లక్ష్యమన్నారు. తాలిబన్ భావజాలం ఉన్న తెలంగాణ కావాలా? బీజేపీ కావాలా? మీరే నిర్ణయించుకోమని ఆవేశంగా ప్రసంగించారు.

ప్రజా సంగ్రామ యాత్ర టీఆర్ఎస్ నియంత, అవినీతి, కుటుంబ పాలనను కూకటి వేళ్లతో పెకిలించేందుకేనని స్పష్టం చేశారు.ఈ యాత్ర రాజకీయ ప్రకంపనలు రేపబోతోందన్నారు. తెలంగాణలో ఒకే కుటుంబం రాజ్యమేలుతోందని అమరవీరుల కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయన్నారు. రూ.లక్షల కోట్లను పూర్తిగా అవినీతికి పాల్పడుతున్నారు. ఒవైసీ, కల్వకుంట్ల కుటుంబాలు రెండింటింకే ప్రజలు రాష్ట్రాన్ని దత్తత ఇచ్చారు. వారే ఇప్పుడు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగితే భవిష్యత్తులో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి వస్తుందిృన్నారు. బండి సంజయ్ పాదయాత్రకు కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్‌ కూడా హాజరయ్యారు.దీంతో ఆయనకు కాస్త భరోసా లభించినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close