జ‌న‌వ‌రి 12 లేదా 14న … బంగార్రాజు

ఈ సంక్రాంతికి బంగార్రాజు రావ‌డం ఫిక్స‌యిపోయింది. అయితే డేట్ లో క్లారిటీ రావాల్సివుంది. జ‌న‌వ‌రి 12న ఈ సినిమాని విడుద‌ల చేద్దామ‌నుకుంటున్నారు. ఆ డేట్ త‌ప్పితే… జ‌న‌వ‌రి 14న వ‌చ్చేస్తుంది. రేపు హైద‌రాబాద్ లో బంగార్రాజు ప్రెస్ మీట్ ఉంది. ఈ ప్రెస్ మీట్ లో రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్ర‌టించ‌బోతున్నారు. నిజానికి ముందు నుంచీ బంగార్రాజుని పండ‌గ సినిమాగానే భావిస్తున్నారు. ఎందుకంటే.. సోగ్గాడే చిన్ని నాయిన సంక్రాంతికే విడుద‌లైంది. నాగ్ కెరీర్ లో అత్య‌ధిక వ‌సూళ్లు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. దానికి ప్రీక్వెల్ గా రూపొందిన బంగార్రాజుని కూడా సంక్రాంతికే విడుద‌ల చేయాల‌ని ప్లాన్‌. అయితే.. ఆర్‌.ఆర్‌.ఆర్‌, రాధేశ్యామ్ మ‌ధ్య బంగార్రాజుని విడుద‌ల చేయ‌డం రిస్క్‌. కాబ‌ట్టి.. రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయ‌లేదు. ఎప్పుడైతే ఆర్‌.ఆర్‌.ఆర్ త‌ప్పుకుందో, అప్పుడు బంగార్రాజుకి ఛాన్స్ దొరికిన‌ట్టైంది. మిగిలిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్ని చ‌క చ‌క అవ‌గొట్టి.. ఈ సినిమాని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సంక్రాంతికే విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం అహ‌ర్నిశ‌లూ క‌ష్ట‌ప‌డుతోంది. అనూప్ రూబెన్స్ ఆర్‌.ఆర్‌. వ‌ర్క్ పూర్త‌యిపోయింది. సీజీ వ‌ర్క్ అక్క‌డ‌క్క‌డ మిగిలి వుంది. మ‌రో మూడు రోజుల్లో అవి కూడా పూర్త‌యిపోయి ఫ‌స్ట్ కాపీ చేతికి వ‌చ్చేస్తుంది. జన‌వ‌రి 14న రాధే శ్యామ్ రావాలి. రాధే శ్యామ్ వ‌స్తే.. జ‌న‌వ‌రి 12న బంగార్రాజు వ‌స్తాడు. లేదంటే… 14న దిగిపోతాడు. రావ‌డం మాత్రం ప‌క్కా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో, హెర్బల్ ప్రొడక్ట్స్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close