బంగార్రాజు టీజ‌ర్‌: పుటికి అన‌గానేమి?

‘సోగ్గాడే చిన్ని నాయిన‌’కి ప్రీక్వెల్ గా రూపొందిన సినిమా ‘బంగార్రాజు’. సోగ్గాడు మ‌ళ్లీ వ‌చ్చాడు అనేది ఉప‌శీర్షిక‌. ఈసారి నాగార్జున‌తో పాటుగా నాగ చైత‌న్య కూడా క‌నిపించ‌బోతున్నాడు. క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో కృతి శెట్టి క‌థానాయిక‌. నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌ల‌తో.. ఈరోజు టీజ‌ర్ వదిలారు.

విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో.. నాగ్ ఎంట్రీ క‌నుల పండుగ‌లా జ‌ర‌గింది. ఆ వెంట‌నే.. చైతూ సోగ్గాడి గెట‌ప్ లో రివీల్ అయ్యాడు. కృతి శెట్టిని లైన్ లో పెట్టి, ఆమెని ప్రేమ‌లో ప‌డేయ‌డానికి చైతూ చేసే విన్యాసాలు టీజ‌ర్ లో క‌నిపించాయి. శ్రుతి ఈ సినిమాలో స‌ర్పంచ్ గా న‌టిస్తోంది. `నువ్వు ఈ ఊరికే కాదు. మ‌న రాష్ట్రానికే స‌ర్పంచ్ అవ్వాలి.. మ‌న దేశానికే స‌ర్పంచ్ అవ్వాలి` అంటూ… ముగ్గులో ప‌డేస్తూ చైతూ డైలాగులు ప‌లికాడు.

‘పుటికి అన‌గానేమి?’ అంటూ ర‌మ్య‌కృష్ణ ఆశ్చ‌ర్యంగా అడ‌గ‌డం… స‌ర‌దాగా ఉంది.

‘ల‌య‌కారుడి స‌న్నిధిలో అప‌శృతి క‌రిమాయ కాక‌పోదు..’ అంటూ… నాగ‌బాబు య‌ముడి గెట‌ప్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఫ‌న్‌తో పాటుగా.. యాక్ష‌న్‌కీ, గ్రాఫిక్స్ కీ ఈ క‌థ‌లో చోటుంద‌ని టీజ‌ర్ చూస్తే అర్థ‌మైపోతోంది. నాగ్ – చైతూ ఇద్ద‌రినీ ఒకేసారి తెర‌పై చూడ‌డం అభిమానుల‌కు క‌నుల పండ‌గే. అనూప్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌…మంచి కిక్ ఇచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.