‘బంగార్రాజు’ ట్రైలర్ : చూపులతోనే ఊచకోత

అక్కినేని నాగార్జు, నాగ చైతన్య కలయికలో తెరకెక్కిన చిత్రం ‘బంగార్రాజు’. సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి కల్యాణ్‌కృష్ణ దర్శకుడు. రమ్యకృష్ణ, కృతిశెట్టి కథానాయికలు. ఈ సినిమా ట్రైలర్ బయటికి వచ్చింది. ట్రైలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సంక్రాంతి హంగులు వున్న సినిమా అనిపించింది. ‘బంగార్రాజు’ పాత్ర గురించి అందరికీ తెలిసిందే. ఆ పాత్రనిని గుర్తు చేస్తూ ‘బంగార్రాజు’ బావ గారు చూపులతోనే ఊచకోత కోసేస్తారు” అనే డైలాగ్ వినిపించారు.

మొదటి పార్ట్లో ‘బంగార్రాజు’కి కొడుకు వుంటే ఈ పార్ట్ లో మనవుడిగా నాగచైతన్య కనిపించాడు. నాగచైతన్య పాత్ర కూడా తాతని పోలిందే. చైతు చేసే అల్లరి, అంతే అల్లరిగా కనిపించిన కృతి శెట్టి..ఈ ఇద్దరూ ట్రైలర్ లో ముచ్చటగా కనిపించారు. చైతు పాత్రని ఉద్దేశించి రావ్ రమేష్ చెప్పిన ఓ మోటు డైలాగ్ కూడా వుంది. యాక్షన్ సీన్స్ తర్వాత వచ్చిన శివలింగం, ప్రళయం సీన్స్ లో గ్రాఫిక్స్ కూడా కనిపించాయి. మొత్తానికి ‘బంగార్రాజు’ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. జనవరి 14న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.