బంగ్లాదేశ్ కి సిరీస్ సమర్పించుకున్న భారత్

బంగ్లాదేశ్ పర్యటనలో భారత్ కి షాక్ తగిలింది. మూడు వన్డేల సిరిస్ లో వరుసగా రెండు మ్యాచులు ఓడిన భారత జట్టు సీరిస్ ని కోల్పోయింది. తొలి వన్డే లో ఒక్క వికెట్ తేడాతో గెలిపొందిన బంగ్లా జట్టు.. రెండో మ్యాచ్ లో ఐదు పరుగుల తేడాతో విజయం సాధించి సిరిస్ కైవసం చేసుకుంది.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు అనూహ్యంగా రాణించింది. 19 ఓవర్లకు 69/6.. బంగ్లా టాప్‌ఆర్డర్‌ అంతా పెవిలియన్‌కు చేరింది. ఇక వందలోపే బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు చుట్టేస్తారని అంతా అనుకొన్నారు. ఐతే మరోసారి బంగ్లా లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు తమ ప్రతాపం చూపించారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన మెహిదీ హసన్ (100 ), మహముదుల్లా (77 )అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. ఏడో వికెట్‌కు ఏకంగా 148 పరుగులు జోడించారు. దీంతో 271పరుగులు సాధించారు.

లక్ష్య ఛేదనలో భారత్‌కు వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు విరాట్ కోహ్లీ (5), శిఖర్ ధావన్‌ (8) పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో శ్రేయస్‌ అయ్యర్ ( 82), అక్షర పటేల్ ( 56) తో ఆకట్టుకున్నారు. అయితే వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత మ్యాచ్ పై మళ్ళీ బంగ్లా పట్టు సాధించింది.

గాయపడిన రోహిత్ శర్మ ఎనిమిదో వికెట్ గా వచ్చి భారత అభిమానుల్లో ఆశలు రేపాడు. మంచి ఇన్నింగ్ ఆడాడు కూడా. 28 బంతులో 51 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్ లో 20 పరుగులు కావాలి అనగా 14 పరుగులు రాబట్టాడు. చివరి బంతికి సిక్స్ కావాలి. యార్కర్ గా వచ్చిన ఆ బంతి సరిగ్గా కనెక్ట్ కాలేదు. దీంతో ఐదు పరుగుల విజయంతో బంగ్లా జట్టు సిరిస్ ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో 48 ఓవర్ కీలక పాత్ర పోషించింది. ఆ ఓవర్ లో బ్యాటింగ్ చేసిన సిరాజ్ సింగల్ తీసి రోహిత్ కి స్ట్రయిక్ ఇచ్చుంటే పరిస్థితి మరోలా వుండేది. కానీ ఒక్క బంతిని కూడా బ్యాట్ కి కనెక్ట్ చేయలేకపోయాడు సిరాజ్. ఈ ఓవర్ రన్ రేట్ పై దెబ్బకొట్టింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close