బాల‌య్య టైటిల్ `అఖండ`

బోయ‌పాటి శ్రీ‌ను షాకిచ్చాడు. బాల‌కృష్ణ సినిమా కోసం ఓ కొత్త టైటిల్ ప్ర‌క‌టించి, అంద‌రినీ ఆశ్చ‌ర్య‌పరిచాడు. బాల‌కృష్ణ – బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని `మోనార్క్` అనే టైటిల్ పెడ‌తార‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఉగాది రోజున టైటిల్ ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర‌బృందం చెప్పిన‌ప్పుడు కూడా `మోనార్క్` ఫిక్స‌వుతుంద‌ని అనుకున్నారు. కానీ.. ఇప్పుడు `అఖండ‌` అనే కొత్త టైటిల్ ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌పరిచాడు. దాంతో పాటు ఓ చిన్న టీజ‌ర్ నీ జోడించాడు.

”హ‌ర‌హ‌ర మ‌హాదేవ శంభో
కాలుదువ్వే నంది ముందు రంగు మార్చిన పంది
కారు కూత‌లు కూస్తే క‌పాలం ప‌గిలిపోద్దీ…” బాల‌య్య ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఈ సినిమాలో బాల‌కృష్ణ రెండు ర‌కాల పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడ‌న్న సంగ‌తి తెలిసిందే. మొద‌టి పాత్ర‌ని ఇది వ‌ర‌కే ప‌రిచ‌యం చేశారు. ఇప్పుడు రెండో పాత్ర‌నీ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. చేతిలో త్రిశూలం, భుజానికి టాటూలు, స‌హ‌జ‌మైన హెయిర్ స్టైల్ తో.. బాల‌య్య క‌నిపించాడు. త‌మ‌న్ ఇచ్చిన ఆర్‌.ఆర్‌.. బాల‌య్య సింహ‌గ‌ర్జ‌న ఈ టీజ‌ర్ కి ప్ల‌స్ పాయింట్. నేల‌కు కొట్టిన రౌడీలు ఎగిరి, గాల్లో గింగిరాలు తిర‌గ‌డం… అనే మార్క్‌… బోయ‌పాటి ఈ సినిమాలోనూ చూపించిన‌ట్టైంది. మొత్తానికి ఈ ఉగాది పండ‌గ రోజున బాల‌య్య రౌద్ర రూపం చూసే ఛాన్స్ ఫ్యాన్స్ కి ద‌క్కింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ ఆస్పత్రికి రఘురామ..! హైకోర్టు ఆదేశాలనైనా పాటిస్తారా..?

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అయినా రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించకూడదనుకున్న సీఐడీ అధికారులు.. ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఐడీ కోర్టు ఆదేశించించినట్లుగానే.. రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించాలని స్పష్టం చేసింది. గుంంటూరు ప్రభుత్వాసుపత్రిలో...

జైలుకు ఆర్ఆర్ఆర్.. కోర్టును లైట్ తీసుకున్న సీఐడీ..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కోర్టులను లెక్క చేయలేదు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్యం అందించాలని ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసి.. జిల్లా జైలుకు తరలించేశారు. ఆయనకు వైద్యం అందించే విషయంలోనే కాదు.. వైద్య నివేదిక...

టీవీ9 ప్రాథమిక నివేదిక.. ఆర్ఆర్ఆర్‌కి సొరియాసిస్..!

రఘురామకృష్ణరాజు కాళ్లకు ఉన్న దెబ్బల గురించి టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ కోర్టు.. హైకోర్టులు ఆదేశించాయి. వైద్యులు నివేదికల కోసం.. కోర్టు ఇచ్చిన సమయం దాటి మరీ టెస్టులు చేస్తున్నారు. నివేదికలు...

రేవంత్‌కు పోలీసులే అలా ప్రచారం చేసి పెడతారు..!

హైదరాబాద్‌లో రూ. ఐదు రూపాయల భోజన కేంద్రాలయిన అన్నపూర్ణ క్యాంటీన్లు కొనసాగుతాయని మీడియాకు సమాచారం ఇచ్చిన తెలంగాణ సర్కార్.. నిజానికి ఆపేసింది. దాంతో పేదలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా చోట్ల టీఆర్ఎస్...

HOT NEWS

[X] Close
[X] Close