2026 టీ 20 వరల్డ్కప్ భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో ఒక షాక్, సర్ప్రైజ్ వుంది. శుభ్మన్ గిల్ ని పక్కన పెట్టేశారు. ఇది గిల్ కి షాకే. చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ అనూహ్యంగా జట్టులో స్థానం దక్కించుకున్నాడు..ఇది నిజంగా సర్ప్రైజ్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అతని ఆటతీరు ఈ అవకాశాన్ని ఇచ్చింది. ఒక బిగ్ రిలీఫ్ కూడా వుంది. గిల్ కారణంగా జట్టులో స్థానం సంపాదించలేపోతున్న సంజుశాంసన్ కి అవకాశం దొరికింది. చాలా మంది ఫ్యాన్స్ ఇదే కోరుకున్నారు.
అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ ( వైస్ కెప్టెన్), సంజుశాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, రింకు సింగ్, బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.. ఇదీ భారత జట్టు.
సూర్యకుమార్ యాదవ్ కెప్టన్ గా ఓకే కానీ తన ఫామ్ కోల్పోవడం శిబిరాన్ని కలవరపెడుతోంది. మిగతా జట్టు సమతూకంలో వుంది. జనవరి 11 నుంచి న్యూజిలాండ్.. భారత్లో పర్యటించనుంది. ఇందులో భాగంగా మూడు వన్డేలు, అయిదు టీ20లు జరగనున్నాయి. న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో కూడా టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టే ఆడనుంది. సూర్యకుమార్ యాదవ్ ఆటగాడికి ఫామ్ లోకి రావడానికి ఇదొక మంచి అవకాశం. అలాగే ఈ సిరిస్ లో ఆటగాళ్ళ తీరుని బట్టి వరల్డ్ కప్ లో ఫైనల్ 11ని ఆడించే అవకాశం వుంది.