టీమిండియా సూపర్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఐదు రోజుల టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకుంటున్నారు. ఈ మేరకు తన ఉద్దేశాన్ని ఆయన బీసీసీఐకి చెప్పారు. వయసు పెరుగుతూండటంతో పాటు టెస్టులు ఆడితే ఇతర ఫార్మాట్ ఆటలు ఎక్కువ రోజులు ఆడలేమన్న ఉద్దేశంలో కోహ్లీ రిటైర్మెంట్ ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది. సుదీర్ఘంగా ఆడుతూండటం వల్ల కొన్ని గాయాల కారణంగా సమస్యలూ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నాడు.
భారత టీమ్‌లో ఇప్పుడు కోహ్లీ ఉన్నంత ఫిట్ గా ఎవరూ లేరు. అయితే కోహ్లీ ఇప్పుడు 37కి చేరుకున్నాడు. ఓ రకంగా ఇది క్రికెట్లో రిటైర్మెంట్ ఏజే. కానీ కోహ్లీలా సూపర్ ఫిట్ నెస్‌తో ఉన్న ఆటగాళ్లు మరో ఐదేళ్లు సులువుగా ఆడగలరు. కానీ ఇటీవలి కాలంలో క్రికెట్ పెరిగిపోయింది. తరచూ మ్యాచ్ లు ఉంటున్నాయి. దీంతో ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగుతోంది. అందుకే సుదీర్ఘంగా సాగే టెస్టు క్రికెట్ ఫార్మాట్ మ్యాచులు ఆడాలని అనుకోవడం లేదు.
టెస్టు క్రికెట్ కు ఆదరణ పెద్దగా లేదు. ఒకప్పుడు టెస్టు క్రికెట్ అంటేనే క్రికెట్. ఇప్పుడుపూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అంతా టీ ట్వంటీ కాలం. వాటిలో ఎక్కువ కాలం ఆడాలంటే ఇప్పుడు టెస్టుల్ని త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తోంది. కోహ్లీ నిర్ణయం మార్చేందుకు బీసీసీ ప్రయత్నిస్తోంది. ఇప్పుడే రిటైర్మన్ వద్దని సలహాలిస్తోంది. అయితే బీసీసీఐ ఒత్తిడితో కొద్ది రోజులు వాయిదా వేసుకున్నా.. ఈ ఏడాదిలో రిటైర్మెంట్ ప్రకటించడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.