మన దేశంలో క్రికెట్ ఎంత కాసులు పండిస్తోంది బీసీసీఐ గల్లాపెట్టెలో ఉన్న లెక్కలు తెలిస్తే సులువుగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికప్పుడు బీసీసీఐ ఎంత బిందాస్‌గా ఖర్చులు పెట్టుకున్నా ఖాతాలో రూ. 20వేల కోట్లు ఉన్నాయి. ఇవన్నీ మిగిలిపోతున్న డబ్బులే. ఐదు సంవత్సరాల కిందట ఇవి ఆరు వేల కోట్లు ఉండేవి. కానీ ఇప్పుడు ఇరవై వేల కోట్లు దాటిపోయాయి. ఆటగాళ్లకు చెల్లించేది. ఇతర రాష్ట్రాల అసోసియేషన్లకు చెల్లించేది అన్నీ పోను.. ఇలా బీసీసీఐ వద్ద నగదు పోగుపడుతోంది.
ప్రపంచంలోనే అన్ని క్రికెట్ బోర్డులకన్నా బీసీసీఐ రిచ్చెస్ట్ అని అందరికీ తెలుసు. కానీ ఇంత పెద్ద మొత్తంలో నగదు ఉంటుందని ఎవరూ ఊహించలేకపోయారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే బీసీసీఐకి ఈ ఆదాయం అంతా ఎలా వస్తుందంటే.. ఆ క్రెడిట్ ధనాధన్ క్రికెట్ ఐపీఎల్‌కే దక్కుతుంది. ఐపీఎల్ ద్వారానే బీసీసీఐకి కాసుల వర్షం కురుస్తోంది. ఆ టోర్నీ నిర్వహణ మొత్తం కమర్షియలైజ్ కావడంతో.. తిరుగులేని విధంగా ఖాతాకు నగదు వచ్చి పడుతోంది.
ఈ నగదు ఎప్పటికప్పుడు పెరుగుతుంది కానీ తగ్గదే కాదు. దేశంలో అత్యుత్తమ క్రికెట్ నైపుణ్యాన్ని వెలికి తీయడానికి.. అత్యుత్తమ క్రీడా సౌకర్యాలను కల్పించడానికి అవసరమైన నగదు బీసీసీఐ వద్ద ఉన్నట్లే. అయితే బీసీసీఐ ఇప్పటి వరకూ ఇతర ఆటలను ప్రోత్సహించినట్లుగా లేదు. క్రికెట్లోనూ కిందిస్థాయి టాలెంట్ ను వెలికి తీసేందుకు పెద్దగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా లేదు.