వెంటాడి వేటాడేంత నేరం జర్నలిస్ట్ రేవతి చేశారా..?

మోజో టీవీ మాజీ సీఈవో, ప్రముఖ జర్నలిస్ట్ రేవతిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలా ఇలా కాదు. ఇంటికొచ్చి… బలవంతంగా తీసుకెళ్లారు. సాయంత్రం వరకూ బంజారిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కూర్చొబెట్టి.. ఆ తర్వాత వైద్య పరీక్షల పేరుతో ఆస్పత్రికి తీసుకెళ్లి.. ఆ తర్వాత రిమాండ్‌కు తరలించారు. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏమిటి..? ఎస్సీ, ఎస్టీలపై దాడికి దిగారా..? ఆ వర్గాల ప్రయోజనాలను దోచుకుతున్నారా…?. కులం పేరుతో దూషణలకు దిగారా..?. అసలు రేవతిని పోలీసులు ఎందుకు టార్గెట్ చేశారు…?

రేవతి చేసిన నేరం ఆ పారిశ్రామికవేత్తను వ్యతిరేకించడమేనా..?

కొన్నాళ్ల క్రితం..మోజో టీవీలో ఓ చర్చా కార్యక్రమం నడిచింది. కేరళలో శబరిమల వివాదం నడుస్తున్న సమయం అది. ఆ టాపిక్‌పైనే చర్చ. ఆ చర్చలో ఓ న్యక్తి పాల్గొన్నాడు. టీవీ చర్చల్లో జరిగే వాదోపవాదాలు జరిగాయి. అతను వెళ్లిపోయాడు. వెళ్లిపోయి నేరుగా.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను మోజో టీవీ చర్చలో అవమానించారని.. కులం పేరుతో దూషించారనేది ఆ ఫిర్యాదు సారాంశం. దానికి సాక్ష్యాలు లేవు. అందుకే అప్పట్లో పోలీసులు కూడా లైట్ తీసుకున్నారు. కానీ ఎప్పటికైనా పనికొస్తుందని అనుకున్నారేమో కానీ.. ఓ కేసు నమోదు చేసి పెట్టేశారు. ఏ వన్‌గా.. ఆ చర్చా కార్యక్రమం నిర్వహించిన రఘు అనే యాంకర్ పేరును… ఏ -2గా మోజో టీవీకి సీఈవోగా ఉన్నందున రేవతి పెరు పెట్టారు. ఆ కేసు అలా ఉండిపోయింది. కానీ ఆమె చేసిన అసలు నేరం అది కాదు. తెలంగాణ ప్రభుత్వంలో… అత్యంత పలుకుబడి కలిగిన ఓ పారిశ్రామికవేత్త, రియల్ ఎస్టేట్ వ్యాపారికి వ్యతిరేకంగా వెళ్లడం. ఆయనపై ఆరోపణలు చేయడం. ఆలా చేస్తూ ..మోజో టీవీలో కథనాలు ప్రసారం చేయడం. అదే అసలు నేరం. ఆ నేరం కింద… అరెస్ట్ చేయలేరు కాబట్టి… పాత కేసును బయటకు తీసి.. ఆమెను ఉన్న పళంగా అరెస్ట్ చేశారు. ఏ-వన్ రఘు వాళ్ల టార్గెట్ కాదు కాబట్టి.. పోలీసులు లైట్ తీసుకున్నారు. ఏ -2 రేవతిని మాత్రం.. వేటాడి.. వెంటాడి.. అరెస్ట్ చేశారు.

చట్టం డబ్బున్నోళ్ల చేతిలో చుట్టంగా మారిపోయిందా..?

కొన్నాళ్ల క్రితం..తెలంగాణ ఉద్యమం కీలకంగా ఉన్న సమయంలో.. ఓ టీఆర్ఎస్ ముఖ్య నేత ఢిల్లీలో ఉద్యమానికి వెళ్లారు. అక్కడ ఓ తెలంగాణ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని.. ఏపీ భవన్ కు చెందిన అధికారిపై ముష్టిఘాతాలు కురిపించారు. ఆయన ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి. ఆ కొట్టుడు వీడియోల్లో రికార్డయింది. ఏ కారణం లేకుండా ఓ ఎస్సీ వ్యక్తిని కొడితే.. వెంటనే అరెస్ట్ చేసి.. కఠిన శిక్షలు పడేలా అట్రాసిటీ చట్టం ఉంది. కానీ ఆ నేతపై ఇప్పటి వరకూ పోలీసులు కనీస చర్యలు తీసుకోలేకపోయారు. మొన్నామధ్య ఓ టీఆర్ఎస్ నేత.. దళితులు చెప్పిన పని చేయలేదని.. శిరోముండనం చేయించి.. చెరువులో నిలబెట్టాడు. దీన్ని వీడియో కూడా తీశాడు. హైలెట్ కావడంతో.. డాక్యుమెంటరీ తీసుకున్నానని కవర్ చేసుకున్నాయి. ఆ నేత దళితులపై దాష్టీకానికి పాల్పడ్డాడని అందరికీ తెలుసు. అయినా ఆయనపై ఏ చర్యలూ తీసుకోలేకపోయారు. ఇవన్నీ ఓ దృష్టాంతాలు మాత్రమే. సిరిసిల్ల దళితల గోడు దగ్గర్నుంచి.. లెక్కలేనన్ని ఘటనలు.. ఎస్సీ, ఎస్టీల మీద రోజూ జరుగుతున్నాయి. ఎంత మందిపై చర్యలు తీసుకుంటున్నారు. కేవలం.. వాళ్లు ఇతర పార్టీల వాళ్లు లేదా.. అధికార పార్టీకి ఎదురు తిరిగిన వారు అయితే మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు. ఆ విషయంలో మాత్రం చట్టం తనంతట తాను పని చేసుకుంటూ పోతుంది. ఎంత యాక్టివ్‌గా అంటే.. తాము కేసు పెట్టాలనుకుంటున్న వ్యక్తిపై.. ఎవరైనా… ఎప్పుడైనా .. ఓ చిన్న ఫిర్యాదు చేసి ఉంటే చాలు.. చట్టం పరుగులు పెడుతుంది. టార్గెట్ చేసుకున్న వ్యక్తిని.. అంతే వేగంగ పట్టుకుని తీరుతుంది. సాక్ష్యాలున్నాయా.. లేవా అన్నది కాదు.. చట్టం ప్రకారం.. ముందు అరెస్ట్ చేసి లోపలేస్తే… చాలు.. ఆ శిక్ష చాలు..! న్యాయస్థానాలు ప్రత్యేకంగా విధించాల్సిన పని లేదు. ఇప్పుడు.. మోజో టీవీ మాజీ సీఈవో రేవతి విషయంలోనూ అదే జరుగుతోంది. చట్టం డబ్బున్న వాళ్లకు చుట్టంగా మారిపోతోంది.

జర్నలిస్టు సంఘాలకు నోరు లెగవదా.. ?

ఓ మహిళా జర్నలిస్టును.. కావాలనే… ఓ పారిశ్రామిక వేత్త టార్గెట్ చేశారని… హైదరాబాద్‌లో ఉన్న ప్రతి చిన్న జర్నలిస్టుకూ తెలుసు. జర్నలిస్టులకు .. తెర వెనుక ఏం జరుగుతుందో.. కనీసం ఆలోచించే శక్తి ఉంటుంది. మరి జర్నలిస్టు సంఘాల నేతలు ఏం చేస్తున్నారు..?. అక్రమాలను ప్రశ్నిస్తే… అధికారంలో ఉన్న పెద్దలతో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డు పెట్టుకుని ఏకంగా చట్టాన్ని నిర్దేశించే పెద్ద మనుషుల ప్రవర్తనను ప్రశ్నించరా..? సాటి జర్నలిస్టు కోసం.. కనీసం ఓ మాట సాయం కూడా చేయరా..?. ఇప్పుడు జర్నలిజం.. చాలా ప్రమాదకర స్థితిలో పడిపోయింది. ఒకప్పుడు.. అధికారులు, రాజకీయ నేతలు.. తాము తప్పులు చేసి.. బయటపడటానికి అధికారాన్ని వాడుకుంటారు. ఇప్పుడు.. తాము తప్పులు చేయడం నుంచి తప్పించుకోవడానికే కాదు… అ తప్పుల్ని ప్రశ్నించకుండా.. జర్నలిజంపైనా .. పోలీస్ పవర్‌ని ప్రయోగిస్తున్నారు. సొంత ప్రయోజనాల కోసం.. జర్నలిస్ట్ సంఘాలు సైలెంట్‌గా ఉంటే.. ఆ తర్వాత ఇదే పరిస్థితి… వారికే ఎదురైనా స్పందన రాదు. ఇది… జర్నలిస్టులకు ఏ మాత్రం మంచిది కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండ‌లు పెంచుతున్న‌ నాగ‌శౌర్య

ల‌వర్ బోయ్ పాత్ర‌ల‌కు అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతాడు నాగశౌర్య‌. త‌న కెరీర్‌లో అలాంటి క‌థ‌లే ఎక్కువ విజ‌యాల్ని అందించాయి. అయితే... మాస్ హీరోగా నిరూపించుకోవాల‌న్న‌ది నాగ‌శౌర్య తాప‌త్ర‌యం. అలాంటి క‌థ‌లు ఎంచుకుంటున్నా - స‌రైన...

‘పుష్ష‌’‌పై విజ‌య్‌ సేతుప‌తి క్లారిటీ

అల్లు అర్జున్ - సుకుమార్‌ల హ్యాట్రిక్ సినిమా 'పుష్ష‌'. ఈ సినిమా కోసం విజ‌య్ సేతుప‌తిని విల‌న్ గా ఎంచుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల విజ‌య్ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడు. ఆ...

వ‌ర్మ‌ని లైట్ తీసుకున్నాడా?

రాంగోపాల్ వ‌ర్మ పేల్చ‌బోతున్న బాంబు `ప‌వ‌ర్ స్టార్‌`. ఓటీటీ వేదిక‌గా వ‌ర్మ ఇది వ‌ర‌కు ప‌లు సినిమాల్ని వ‌దిలాడు. దేనికీ రాని క్రేజు.. `ప‌వ‌ర్ స్టార్‌`కి వ‌చ్చింది. ఈ సినిమా స్పెషాలిటీ గురించి...

రాజకీయాల్లో రాజస్థాన్ “సచిన్” హిట్ వికెట్ ..!?

రాజస్థాన్ ప్రభుత్వాన్ని మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కూల్చేసినట్లుగా కూల్చేస్తారని భావించిన సచిన్ పైలట్.. చివరికి.. హిట్ వికెట్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తన వైపు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఆయన తనకు...

HOT NEWS

[X] Close
[X] Close