బెల్లంకొండ ‘స్వాతిముత్యం’

తెలుగు చిత్ర‌సీమ‌లో ఓ క్లాసిక్ ‘స్వాతిముత్యం’. క‌మ‌ల్ – విశ్వ‌నాథ్ చేసిన అద్భుతం ఆ సినిమా. ఇప్పుడు ఈ టైటిల్ ని గుర్తు చేస్తున్నాడు బెల్లంకొండ గ‌ణేష్‌. త‌ను క‌థానాయ‌కుడిగా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ల‌క్ష్మ‌ణ్ కె.కృష్ణ ద‌ర్శ‌కుడు. సూర్య‌దేవ‌ర నాగ వంశీ నిర్మాత‌. ఈ చిత్రానికి ‘స్వాతిముత్యం’ అనే పేరు ఖ‌రారు చేశారు. ఆ స్వాతి ముత్యానికీ, ఈ స్వాతిముత్యానికీ క‌థ‌తో సంబంధం లేదు గానీ – హీరో క్యారెక్ట‌రైజేష‌న్ మాత్రం `స్వాతిముత్యం`లాంటిద‌ట‌. అందుకే ఆ పేర‌కు పెట్టారు.

ఈ రోజు గ‌ణేష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి గెట‌ప్ లో.. మెళ్లో లాప్ టాప్ బ్యాగ్ వేసుకుని క్లాసిటీ క‌నిపిస్తున్నాడు గ‌ణేష్‌. వర్ష బొల్ల‌మ్మ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. త్వ‌ర‌లోనే టీజ‌ర్ ని విడుద‌ల చేస్తారు. మ‌హ‌తి విద్యాసాగ‌ర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘గీతా’లో మరో సంతకం

'బొమ్మరిల్లు’ సినిమా దర్శకుడు భాస్కర్ జాతకాన్ని మార్చేసింది. ఆ సినిమానే ఆయన ఇంటిపేరు అయింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలతో సినిమా చేసే ఛాన్స్ త్వరగానే వచ్చేసింది. అయితే...

విష్ణు నిర్ణ‌యం బాగుంది.. కానీ!?

`మా` అధ్య‌క్షుడిగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు మంచు విష్ణు. వీలైనంత త్వ‌ర‌గా త‌న మార్క్ ని చూపించాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. `మా` బై లాస్ లో కొన్నింటికి మార్చాల‌న్న‌ది విష్ణు ఆలోచ‌న‌. ...

ఏపీ చీకట్లే తెలంగాణ వెలుగులకు సాక్ష్యాలన్న కేసీఆర్

టీఆర్ఎస్ అధినేతగా 9వసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్ తన ప్రసంగంలో .. తెలంగాణ అభివృద్ధిని.. ఏపీతో పోల్చి విడిపోవడం వల్ల ఎంత ప్రగతి సాధించామో వివరించారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకట్లోకి...

పూరి గ‌ట్స్‌.. రెండ్రోజుల ముందే ప్రీమియ‌ర్‌

సినిమాకి టాక్ చాలా ముఖ్యం. పాజిటీవ్ టాక్ వ‌స్తే - క‌ల‌క్ష‌న్లు వ‌స్తాయి. ఏమాత్రం తేడా వ‌చ్చినా - ఫ‌ట్‌మ‌న‌డం ఖాయం. రిలీజ్ డే టాక్ అనేది వ‌సూళ్ల‌లో కీల‌క పాత్ర పోషిస్తుంటుంది....

HOT NEWS

[X] Close
[X] Close